Breaking News

09/03/2019

ఇవాళే మా ఎన్నికలు

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.in)
మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన శివాజీరాజా, నరేష్‌లు ప్రత్యర్థులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, జయసుధలు ప్రత్యర్ధులుగా తలపడిన సందర్భంలో విమర్శలు ప్రతి విమర్శలతో ‘మా’ ఎన్నికల్ని రసవత్తరంగా మార్చేశారు. ప్రస్తుతం ఆ ఎన్నికల వేడిని రెట్టింపు చేస్తూ.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఆదివారం ఉదయం (మార్చి 10) 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎలక్షన్ కమిటీ. 


ఇవాళే మా ఎన్నికలు

సుమారు 800 మంది మూవీ ఆర్టిస్ట్‌లకు జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నువ్వా నేనా పోటీ పడుతున్నారు నరేష్, శివాజీ రాజా ప్యానల్స్. అయితే దాసరి మరణం తరువాత ‘మా’ గుట్టును బయటపెట్టేసుకున్న ఆర్టిస్ట్‌లు ఈ ఎన్నికల్లో మీడియాకి ఎక్కి మరింత రచ్చ చేసుకున్నారు. కాగా.. మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీ మద్దతు తమకే అంటూ ధీమాగా ఉన్న శివాజీరాజాకి చివర్లో గట్టి దెబ్బ తగిలింది. తమ మద్దతు నరేష్ ప్యానల్‌కి అంటూ గత రాత్రి ట్విస్ట్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఈ ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ నరేష్ ప్యానల్‌కే ఉంటుండగా.. నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు బహిరంగంగా మద్దతుని ప్రకటించలేదు. ఇక ఈ ఎన్నికలు ఉదయం ప్రారంభమై.. సాయంత్రానికే ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్, శివాజీ రాజాలు ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నారు.

No comments:

Post a Comment