Breaking News

09/03/2019

మా ఎన్నికలు నిధుల కోసమా.? నిబద్ధత కోసమా.?

హైదరాబాద్ మార్చ్ 9  (way2newstv.in
టాలీవుడ్ కు కేంద్రమైన మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా)లో గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. టీవీల కెక్కి టాలీవుడ్ పరువును బజారుకీడుస్తున్నారన్న ఆవేదన సినీ ప్రముఖుల్లో నెలకొంది. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ లో గడిచిన సారి శివాజీ-నరేష్ ద్వయం మంచి పనులు చేసింది. సేవతో సినీ జనాలను ఆకట్టుకుంది. కానీ ఎక్కడొచ్చిందో కానీ తిరకాసు ఒకరిపై ఒకరు విమర్శలు - ప్రతివిమర్శలు రచ్చకెక్కారు. పెద్దల హెచ్చరికలతో వెనక్కి తగ్గారు. డబ్బులు ఈవెంట్ల ప్రధానంగా సాగిన ఈ సేవా నిరతిలో ఎవరికి వారు క్రెడిట్ కోసం పరితపించి పక్కోళ్లు అవినీతి చేశారంటూ తిట్టుకున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు దక్కక.. రోజువారీ తిండికి కూడా కష్టపడుతున్న కళాకారులు ఎందరో ఉన్నారు.. వారిందరికీ భరోసా ఇవ్వాల్సిన శివాజీ-నరేష్ లు కొంత వరకూ సఫలీకృతం అయ్యారు. కానీ ఇప్పుడు విడిపోయి సంఘాన్ని మొదటికి తీసుకొచ్చారు. మాకు నిధుల కోసం చేసిన ఈవెంట్లతోనే గొడవలు మొదలయ్యాయి. సేవా చేయాలన్న సంకల్పం.. డబ్బులతో పక్కదారి పట్టి విమర్శలకు ఉసిగొల్పింది. కళాకారులకు సేవ చేయాల్సిన ప్రతినిధులు పైసల పేరుతో విడిపోయి రచ్చ చేసుకున్నారు. కలిసి కూర్చొని లెక్కలు తీసి అన్నార్థులకు ఖర్చు చేస్తే సరిపోయేదానికి రచ్చ కెక్కి రచ్చరచ్చ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. 


మా ఎన్నికలు నిధుల కోసమా.? నిబద్ధత కోసమా.?

నిజానికి శివాజీ కానీ నరేష్ కానీ ఒపికతో మాలోని సమస్యలు పరిష్కరించుకుంటే టాలీవుడ్ కలకాలం కలిసికట్టుగా ఉంటుంది. కానీ  ఇప్పుడు ఎన్నికల పేరుతో రణరంగం సృస్టిస్తున్నారు. టీవీల్లో చర్చల పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  సేవా పరమార్థం అంటున్న ఈ సినీ పెద్దలు ఇప్పుడా ఆ సేవను పక్కకు పెట్టి మా పీఠం కోసం కొట్టుకుంటున్నారు. మంచిగా సాగుతున్న ‘మా’నావలో యుద్ధానికి దిగుతున్నారు. ఇన్నాల్లు చేసిన మంచిపని ఇప్పుడు ఎన్నికలతో పోగొట్టుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.‘మా’కు మూలపురుషులైన స్టార్ హీరోలు సినీ ప్రముఖులను కలిసి మద్దతు తమకే అని చెప్పుకుంటున్న మా పోటీదారులు వారిని ఇరకాటంలో పడేస్తున్నారు. రేపొద్దున వైరివర్గం గెలిస్తే సదురు హీరోల పరపతి ప్రతిష్ట మసకబారుతుంది. అందుకే అటు పెద్దలు కూడా ఈ రెండు గ్రూపుల కొట్లాటలో సమిధలవుతున్నారు. బహిరంగంగా ఈ వర్గానికి మద్దతు అని చెప్పలేకపోతున్నారు. వీరి కొట్లాట సినీ పెద్దలను కూడా ఇరకాటంలో పడేస్తోంది.ఆపదలో ఉన్న కళాకారులకు సేవ చేయడానికి... సినిమాల్లోని సమస్యలు పరిష్కరించడానికి తెలుగు సినిమా ప్రముఖులంతా కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోయిేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సేవే పరమార్థం అయిన ఈ సంఘం దానిపై దృష్టి సారిస్తే బావుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఆ సేవలో నిధుల గొడవ ఇరు వర్గాలను రచ్చకీడ్చింది. నిబద్ధత కోసం ఇరువర్గాలు పోట్లాడుకుంటున్నాయి. ఇందులో సేవ పక్కకుపోయి ఆధిపత్యం తెరమీదకొచ్చింది. నిబద్ధతను చాటుకోవడానికి వైరివర్గాలను అభాసుపాలు చేసేస్తున్నారు.. అంతిమంగా టాలీవుడ్ జనాల వ్యక్తిత్వాలకే ఇది దెబ్బ పడుతోంది.  ‘మా’ ప్రతిష్టను మసకబారుస్తోందన్న ఆవేదన జనాల్లో వ్యక్తమవుతోంది..టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ. ఇంతకీ సినీ ప్రముఖుల మద్దతు శివాజీకా.. నరేష్ కా.. ఇద్దరూ మా కోసం తపన పడ్డవారే.. ఇద్దరూ సేవా కార్యక్రమాలతో ‘మా’ను ఎత్తుకు తీసుకెళ్లినవారే. ఇప్పుడు నిధుల విషయంలో వచ్చిన తేడా ఇద్దరినీ దూరం జరిపింది. మాట్లాడుకుంటే పోయేదానికి కత్తులు దూసుకునేలా చేసింది. పైసామే పరమార్తగా సాగుతున్న ఈ  సమాజంలో ‘మా’ కూడా ఇలా విడిపోవడంపై సినీ పెద్దలు మనస్తాపం చెందుతున్నారు. ఎవ్వరికీ మద్దతివ్వాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. ఎవరో ఒకరికి మద్దతిచ్చినా మరొకరిని అవమానించినట్టవుతుంది. రేపు గెలిచాక కూడా ముఖం చూసుకోలేని పరిస్థితిని శివాజీ నరేష్ లు క్రియేట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నది సినీ పెద్దల వాదన..కళాకారులను ఆదుకునే విషయంలో పోటీపడండి.. వారి బాగోగుల కోసం పెద్ద కార్యక్రమాలు నిర్వహించడంలో పోటీపడండి.. కానీ మాపై ఆధిపత్యం కోసం రెండు చీలిపోవడంపై సినీ పెద్దలతోపాటు సామాన్య జనం కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గొడవలను టీవీలో చూసి వీటివల్ల ఎవరికి ఉపయోగం అని జనం చర్చించుకుంటున్నారు.. టాలీవుడ్ పరువును బజారుకీడ్చడం తప్పితే దీనితో ఒరిగేదేమిటని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో కొట్లాడుకుంటున్న వలే.. సినిమా సంఘాంలోనూ ఈ కొట్లాటలు చూసి సినీ అభిమానులు జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సేవ ముసుగులో తలపడుతున్న ఈరెండు గ్రూపుల వల్ల ఎవరికి లాభం.? ఎవరికి నష్టం అని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment