విశాఖపట్టణం, మార్చి 1, (way2newstv.in)
విశాఖకు రైల్వే జోన్ అన్నది ఓ కలలా అయిపోయింది. అటువంటి దాన్ని సాకారం చేసింది బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం. నిజంగా ఈ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఎందుచేతంటే రైల్వే జోన్ డిమాండ్ అన్నది ఈనాటిది కాదు. డెబ్బయి దశకం నాటి డిమాండ్ ఇది. అప్పట్లో విశాఖ ఎంపీగా స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం ఉండేవారు. ఆయన తొలిసారిగా విశాఖకు ఓ జోన్ ఉంటే బాగుంటుందని, ఆ అవసరం ఈ ప్రాంతానికి ఉందని బలంగా నమ్మినవారు. ఆ తరువాత వచ్చిన ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వాలు దీన్ని ఓ ఎన్నికల నినాదంగా చేసుకుని లబ్ది పొందారు తప్ప జోన్ మాత్రం మంజూరు చేయలేదు. ఇక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులుగా అయిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే విశాఖ ఎంపీలుగా బలమైన నేతలే ప్రాతినిధ్యం వహించారు.
విశాఖ రైల్వే జోన్ తో బీజేపీకి లాభమేనా
అయితే ఎవరూ కూడా జోన్ ఆవశ్యకతను వివరించి సాధించలేకపోయారు. అటువంటిది విశాఖ ఎంపీగా బీజేపీ తరఫున తొలిసారిగా నెగ్గిన కంభంపాటి హరిబాబు దాన్ని చేసి చూపించారనే చెప్పాలి. ఆయన తరచూ ఒకే మాట చెప్పేవారు. తన పదవీకాలం ముగిసేలోగానే జోన్ వచ్చి తీరుతుందని. అదే ఇపుడు నెరవేరింది.విశాఖకు రైల్వే జోన్ మంజూరు వల్ల విశాఖకు లాభం సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ఎంపీ సీటు అంటేనే బహుళ జాతి సమ్మేళనం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ కార్యాలయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పారిశ్రామిక రాజధానిగా పేరు గడించింది. రైల్వే జోన్ ద్వారా కేంద ప్రభుత్వ ఉద్యోగులు భారీగా లబ్దిపొందుతారు. ఉపాధి పదోన్నతులు బాగా వస్తాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విశాఖ కేంద్రంగా వస్తుంది. దాంతో యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా ప్రత్యక్ష పరోక్ష పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయి. దాంతో ఆయా వర్గాలు బీజేపీ వైపుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.క రైల్వే జోన్ ప్రకటన తరువాత విశాఖ బీజేపీ నేతలకు ఓ ధైర్యం వచ్చింది. ఇక్కడ నుంచి పోటీ చేయనని చెప్పిన హరిబాబు ఇపుడు మనసు మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనే మరో మారు ఎంపీగా పోటీకి దిగుతారని అంటున్నారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆ పార్టీ వైపుగా జనం చూసేందుకు అవకాశం ఏర్పడింది. అగ్ర వర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు. గృహ నిర్మాణాలకు సంబంధించి జీఎస్టీ లో మధ్యతరగతికి రాయితీలు, ప్రత్యేకించి సర్జికల్ స్ట్రైక్స్ వంటివి కూడా అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖ ఎంపీ అభ్యర్ధి విషయంలో సానుకూలంగా స్పందించేందుకు ఆస్కారం కల్పిస్తాయి. వీటాన్నిటికీ మించి జోన్ ఇచ్చామని చెప్పుకోవడం ద్వారా బీజేపీ ఇపుడు మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కూడా ఆ పార్టీని వీడి వెళ్లరని అంటున్నారు. ఆయనే మరో మారు పోటీ చేస్తారని కూడా అనుచరులు గట్టిగా చెబుతున్నారు. ఇక విశాఖ అర్బన్ జిల్లాలో బీజేపీకి బలం ఉంది. మిగిలిన సీట్లలో కూడా పోటీకి ఇపుడు నాయకులు రెడీ అవుతారని అంటున్నారు.
No comments:
Post a Comment