Breaking News

06/03/2019

వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయండి : కలెక్టర్

తక్షణమే చలివేంద్రాలను ఏర్పాటు చేయండి
ఉపాధి కూలీలకు నీడను ఏర్పాటు చేయండి 
ఈత రాని వారు ఈతకు వెళ్లకుండా టాం టాం వేయండి
కర్నూలు, మార్చి 6, (way2newstv.in)
ఎండలు అధికంగా ఉన్నాయి. వడగాలులకు గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయండి. తక్షణమే ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మేజర్ పంచాయతీలు, చౌరస్థాలు, ముక్య కూడళ్లు, బస్ స్టాండు లందు వెంటనే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావును ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో తాగునీటిని ఏర్పాటు చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలోని అందరూ మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ప్రశాంతిని ఆదేశించారు. 


వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయండి : కలెక్టర్ 

ప్రతి ఆర్డీవోకు లక్ష చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మునిసిపల్ కమీషనర్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అన్ని తహశీల్దార్లు, ఎంపీడీవో, అంగన్వాడీ, మండల వ్యవసాయ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో తాగునీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఎక్కడైనా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది ఉంటే మండల స్థాయీ కమిటీకు కన్వీనర్ గా ఉన్న ఎంపీడీవో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి దాకా 43 హ్యాబిటేషన్ లలో ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని అందిస్తున్నామని , మరో 50 హ్యాబిటేషన్ లలో నీటి ఎద్దడి రావచ్చునని ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ హరిబాబు కలెక్టర్ దృష్ఠికి తీసుకు వచ్చారు. అవసరమైతే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎస్ ఈ ను ఆదేశించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు షామియాణాల ద్వారా నీడను ఏర్పాటు చేసి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని ద్వామా పీడీ వెంకట సుబ్బయ్యను ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు , రానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో తాగునీటిని ఏర్పాటు చేయాలని డీ ఈ ఓ తహెరా సుల్తానా ను ఆదేశించారు. హంద్రీ నీవా, ఇతర నదీ ప్రవాహాలు, కుంటలు నందు ఈత రాని వారు ఈతకు వెళ్లరాదంటూ గ్రామాల్లో టాం టాం వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో జేసి పఠాన్ శెట్టి రవి శుభాష్, నగర కమీషనర్ ప్రశాంతి, డిఆర్డీఏ పీడి రామకృష్ణ, జెడ్పీ సీఈవో విశ్వేశ్వర నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment