Breaking News

06/03/2019

కమలం..తెలంగాణ టార్గెట్ ఫైవ్

హైద్రాబాద్, మార్చి 6, (way2newstv.in)
తెలంగాణ అసెంబ్లీల్లో కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా నిలుపుకోలేకపోయిన బీజేపీ... లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో కనీసం ఐదు లోక్ సభ స్థానాలు దక్కించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ జాతీయనాయకత్వం... ఇప్పటికే తెలంగాణను నాలుగు క్లస్టర్స్‌గా విభజించి గెలుపుపై వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వరుస సభలు నిర్వహించేందుకు పర్యటనలు రానున్నారు. ఇక్కడి నుంచే ఆయన తెలంగాణలో లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


కమలం..తెలంగాణ టార్గెట్ ఫైవ్

జాతీయస్థాయిలో ఎంతో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ... తెలంగాణలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా బలహీనపడుతోంది. స్థానికంగా ఉండే నాయకత్వం ఇందుకు ఒక కారణం కాగా... బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అంతర్గతంగా స్నేహబంధం ఉందనే ప్రచారం ఇందుకు మరో కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈ రెండు కారణాలే ప్రధానమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సమస్యలను అధిగమించకుండా బీజేపీ తెలంగాణలో మళ్లీ పుంజుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణ నుంచి ఎన్నో కొన్ని సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీ... అందుకు తగ్గట్టుగానే వ్యూహారచన చేసినట్టు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మొత్తానికి తెలంగాణలో మళ్లీ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీకి అమిత్ షా టూర్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

No comments:

Post a Comment