Breaking News

14/03/2019

మంత్రులకు ఇంటిపోరు

ఒంగోలు, మార్చి 14, (way2newstv.in
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకి సరిగ్గా నెలరోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధులని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే చాలాచోట్ల అభ్యర్ధులకి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రచారం చేసుకోమని చెప్పేశారు. ఇక పోటీ ఉన్న స్థానాల్లో నేతలతో మాట్లాడి, ఒప్పించి మెజారిటీ మద్ధతు ఉన్న అభ్యర్ధులకి సీట్లని ఖరారు చేసే పనిలో ఉన్నారు. అలాగే సీటు దక్కని నేతలకి భవిష్యత్‌లో మంచి పదవులు ఇస్తామని చెబుతున్నారు.అయితే కొన్ని చోట్ల అభ్యర్ధులని అటు ఇటు మారుస్తూ ఉన్నారు. అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని ఎంపీలుగా పంపడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, ఆది నారాయణరెడ్డిలు తమ సొంత సీట్లలో పోటీకి దిగలేని పరిస్తితి నెలకొంది. వీరు బలమైన నేతలు కావడంతో చంద్రబాబు ఎంపీలుగా పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఆది నారాయణరెడ్డిని కడప ఎంపీ బరిలో ఉంచారు. 


మంత్రులకు ఇంటిపోరు

దీనికి ఆది కూడా అధినేత మాట కట్టుబడి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమై…ప్రచారం కూడా చేస్తున్నారు. మరో మంత్రి శిద్ధా రాఘవరావుని కూడా ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలపాలని బాబు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆయనకి దర్శి టికెట్ ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయనని చెప్పడంతో…ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల వారితో మంచి సంబంధాలు ఉన్న శిద్దా రాఘవరావును పార్లమెంట్‌ బరిలో దించేందుకు అధినేత చంద్రబాబు ఆలోచన చేశారు.ఇక అధినేత మాటని కాదనలేక శిద్ధా కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే శిద్ధా అనుచరులు మాత్రం దర్శిలోనే పోటీ చేయాలని కోరుతున్నారు. దీంతో అధినేతతో మరోసారి మాట్లాడేందుకు శిద్ధా సిద్ధమయ్యారు. ఒకవేళ తనని లోక్‌సభకి పంపితే…కుటుంబంలో ఒకరికి దర్శి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.అటు గంటా శ్రీనివాస్‌ది కూడా ఇదే పరిస్తితి…గత ఎన్నికల్లో భీమిలి నుండి పోటీ చేసిన గంటాని ఈసారి విశాఖ ఎంపీ బరిలో దించాలని భావిస్తున్నారు. ఒకవేళ గంటా ఒప్పుకొని పక్షంలో అనకాపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేయించాలని టీడీపీ అధినేత అనుకుంటున్నారు.ఇక మరో ఇద్దరు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, జవహర్‌లది విచిత్ర పరిస్తితి. సొంత నియోజకవర్గాల్లో వీరికి రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. కొవ్వూరులో మరోసారి మంత్రి జవహర్‌కి సీటు ఇస్తే సహకరించేది లేదని కొందరు టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ సీటుని మాజీ ఎమ్మెల్యే రామారావు కూడా కోరుతున్నారు. అయితే ఎట్టి పరిస్తితుల్లో కొవ్వూరు నుండి పోటీ చేసేది తానే అని మంత్రి ప్రకటిస్తున్నారు.అలాగే రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకి టికెట్ ఇవ్వడంతో…సీనియర్ నేత మెట్టు గోవింద్ రెడ్డి ఈరోజు పార్టీని కూడా వీడారు. అటు మంత్రికి టికెట్ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చంద్రబాబుని కోరారు. దీంతో దీపక్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.ఇక ఆది మినహా మిగిలిన నలుగురు మంత్రులు ఎక్కడ నుండి బరిలోకి దిగుతారనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

No comments:

Post a Comment