Breaking News

27/03/2019

వాకలగరువుకు ఏటా ముప్పే

రాజమండ్రి, మార్చి 27, (way2newstv.in)
తూర్పు గోదావరి జిల్లాను సస్య శ్యామలం చేసే గోదావరే... వరద తాకినవేళ... అధిక వర్షాలు పడిన సమయాన... మహోగ్రరూపం దాల్చుతుంది. తీరంపై తన ప్రభావాన్ని చూపుతుంది. కోతకు గురవ్వడంతో విలువైన కొబ్బరి తోటలతో పాటు తీరంలో ఉన్న గంగపుత్రుల ఇళ్లను తనలో కలిపేసుకుంటుంది. పదేళ్ల కాలంలో నదీకోతకు వేలాది ఎకరాలు, వందలాది ఇళ్లు గోదారిపాలయ్యాయి. అంబాజీపేట మండలంలో నదీతీరంలో ఉన్న శివారు గ్రామం వాకలగరువు. వైనతేయ ఎడమ గట్టును ఆనుకొని సుమారు 100 వరకూ మత్స్యకారుల గృహాలు ఉన్నాయి. 2002లో పిషర్‌మెన్‌ కాలనీ పేరుతో 68 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పట్టాలిచ్చింది. 


వాకలగరువుకు ఏటా ముప్పే 

ప్రస్తుతం 100కు పైగా కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. తొండవరం నుంచి పాశర్లపూడి - బోడసకుర్రు బ్రిడ్జి వరకూ నదీ కోత ఎక్కువగా ఉండటంతో పదేల్ల క్రితం వాకలగరువు, తొండవరం సరిహద్దుల్లో మూడు గ్రోయన్లను నిర్మించారు. ఈ గ్రోయన్లు పిషర్‌మెన్‌ కాలనీకి సుమారు 200 మీటర్ల ఎగువ ఉన్నాయి. దీంతో కాలనీ సమీపంలో నదీకోత ఎక్కువైంది. కాలనీ నుంచి బోడసకుర్రు బ్రిడ్జి వరకు సుమారు కిలో మీటరు మేర నదీకోతతో ఇళ్లకు ముప్పువాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాకలగరువు, పిషర్‌మెన్‌ కాలనీ వద్ద నదీకోత వల్ల రెండు దశాబ్ధాల కాలంలో 70 మీటర్ల వెడల్పున భూభాగం నదీలో కలిసిపోయింది. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు. ఇక్కడ నదిలోతు కూడా ఎక్కువ ఉండటంతో ఏడాదికేడాది కోత పెరిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు. కోతను అరికట్టేందుకు రివిట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 

No comments:

Post a Comment