కౌతాళం, మార్చి 27, (way2newstv.in)
కర్నూలు జిల్లా కైతాళం మండల కేంద్రం లో శివభక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమయింది. ప్రతియేటా ఉగాదిని పురస్కరించుకుని కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు శ్రీశైలం కు ప్రతి యేటా కాలి నడకన చేరుకొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటుంటారు. ఈ యేటా కూడా కాలినడకన వచ్చేటువంటి భక్తులకు మండల కేంద్రంలో మండల శివభక్తులు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కౌతాళం లో కాలినడకన వచ్చు కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమాలు
స్థానిక శివ భక్తుల ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మేము మా కుటుంబ సభ్యులు ఉగాది కు శ్రీశైలానికి పాదయాత్ర చేస్తూ పరమేశ ఆశీర్వాదాలు తీసుకుంటామని అన్నారు. మేమంతా మల్లన్నను చేరుకొనేంత వరకు దారిపొడవునా ఇలాంటి అన్న దాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని అన్నారు.
No comments:
Post a Comment