విజయవాడ, మార్చి 28 (way2newstv.in)
ఆలూ లేదు.. చూలు లేదు... అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఉంది.. పవన్ కామెంట్స్...రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని భావించిన ప్రజా స్వామ్య వాదులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో అన్ని పక్షాలు మూకుమ్మడిగా ఒక పార్టీని కేంద్రంగా చేసుకుని విరుచుకుపడుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వల్లిస్తున్న సినిమా డైలాగులు కూడా ప్రజాస్వామ్య వాదులకు, ఓ వర్గం ప్రజలకు కూడా ఎబ్బెట్టుగానే తోస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న జనసేనాని పవన్.. వచ్చే ఎన్నికల అనంతరం సీఎంగా ప్రమాణం చేసేది తానే నంటూ వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక రాష్ట్రంలో అనేక మార్పులు తెస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ధైర్యంగా మాట్లాడిన ఏకైక పార్టీ తమదేనని చెప్పుకొచ్చాడు పవన్.
పవన్ అను నేను...
అదేసమ యంలో రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు, స్నేహాలు వేరని పవన్ వల్లించాడు. అదేసమయంలో పార్టీలు మారు తున్నారంటూ.. కొందరిపై విరుచుకుపడ్డారు. అయితే, ఒకవేలు ఇతరుల వైపు చూపిస్తే.. మనవైపు మూడు వేళ్లు చూపిస్తా యనే సామెతను పవన్ మరిచిపోయాడా? అనేది ఇప్పుడు అడుగుతున్న ప్రధాన ప్రశ్న. వ్యక్తిగా పవన్‌ను గౌరవించే వారు కూడా ఇప్పుడు పవన్ తీసుకున్న లైన్ కానీ, ఆయన చేస్తున్న కామెంట్లను కానీ భరించలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన ఇప్పటి వరకు కేవలం 100 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది.అదికూడా ఎక్కడో ఉన్న బీఎస్పీకి 21 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు మరికొన్ని సీట్లు కేటాయించి! వీరిలో గెలిచేవారు ఎవరు? అనేది మరో ప్రధాన ప్రశ్న. పైగా తాను కండెక్టర్‌కు టికెట్ ఇచ్చానని, కూలి పని చేసుకుని బతికే కుటుంబానికి టికెట్ ఇచ్చానని చెప్పుకొంటున్నా.. టికెట్లు వేరు క్షేత్రస్థాయిలో ఓట్ల రాజకీయం వేరనే విషయం పవన్‌కు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో పవన్ ప్రవచిస్తున్న ఈ సీఎంగా ప్రమాణ స్వీకారం అనే విషయం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. ఆశ ఉండొచ్చు.. కానీ, అసలు బలమైన అభ్యర్థులే లేనప్పుడు.. తనకు కేడర్ కూడాలేనప్పుడు సీఎం అవ్వాలని, ప్రమాణం చేయాలని చెబుతున్న పవన్ వీటిని ఎలా నెరవేర్చుకుంటారో చూడాలి.
No comments:
Post a Comment