Breaking News

06/03/2019

పదహారు స్థానాల్లో గులాబీ పార్టీని గెలిపించండి

కరీంనగర్, మార్చి 6 (way2newstv.in
తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే, దేశ ప్రధాని ఎవరన్న విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా మరో 70 మంది ఎంపీలు తోడవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని ఉద్ధరిస్తారని అందరూ భ్రమపడ్డారు కానీ, దేశం ముందుకు పోదన్న విషయం అర్థమైందని అన్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ లిద్దరూ దొందూ దొందేనన్న విషయం ప్రజలకు బాగా తెలుసని వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని, ‘కేంద్రంలో బడితె ఉన్నోడిదే బర్రె అయింది’ అని విమర్శించారు. 

 
పదహారు స్థానాల్లో గులాబీ పార్టీని గెలిపించండి

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన అత్తగారి ఊరి దాకా రైలు వేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ మనషులే అని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని పార్టీ నాయకులు పని చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్తలైనా.. అందరూ మనోళ్లే.. అందరూ కేసీఆర్ మనిషులే అని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సిరిసిల్లలో తనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా రైతుబంధు పథకం కింద డబ్బులు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందారు. ప్రభుత్వ పథకాలను లబ్ది పొందిన తర్వాత మనం ఓటు అడగడానికి మొహమాటం అవసరం లేదన్నారు. మనోడు కాదనే ముద్ర వేయొద్దన్నారు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ను గౌరవిస్తారు. ఇక ఎంపీ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. ఓటేసేది కేసీఆర్ కే మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టులు రావాలంటే 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకోవాలి. ఢిల్లీ గులాములతో మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు. తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే మన హక్కులను సాధించుకోగలం. ఢిల్లీ పీఠంపై ఎవరూ ఉండాలో గులాబీ పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment