Breaking News

06/03/2019

క్రిమినల్ పార్టీ వైకాపా ను ప్రజలు నమ్మరు.

150 అసెంబ్లీ, 25పార్లమెంట్ స్థానాల్లో గెలుపు మాదే
-  మంత్రి  ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
గుంటూరు(way2newstv.in)
రాష్ట్రంలో జగన్ నిజస్వరూపం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు బృందావన్ గార్డెన్ లో   జిల్లా తెదేపా  కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే సమాజం ఎలా ఉంటుందో ఫామ్ 7 దాఖలుతో తేలిపోయిందన్నారు.
మోడీ, కేసీఆర్ డైరెక్షన్ లో ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టి కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే తొలగించేందుకు ప్రయత్నం చేసిన జగన్ అధికారంలోకి వస్తే ఆస్తులను ఉండనిస్తాడా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. 


క్రిమినల్ పార్టీ వైకాపా ను ప్రజలు నమ్మరు

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. కేసుల్లో ఇరుక్కొని మోడీ ని చూసి...జగన్ భయపడతాడేమో కానీ చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏంటని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్కి రాకుండా పారిపోయి ప్రజాయాత్ర చేస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అనుభవం లేని, అమలు కానీ హామీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరని అన్నారు. 150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఎమ్మెల్యే  జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీటును సాధించేందుకు జగన్ ఎన్ని అరాచకాలు సృష్టించేందుకైనా సిద్దంగా ఉన్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఓట్ల అక్రమ తొలగింపు ప్రక్రియ చేయడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. క్రిమినల్ ఆలోచనలు జగన్ కి కొత్త కాదని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంక్షేమ పథకాలు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ దోపిడీ కారణంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో మోదుగుల పార్టీ మారారని, సిగ్గులేకుండా దొంగల ముఠాలో చేరేందుకు వెళ్ళిన మోదుగులకు ప్రజలే బుద్దిచెప్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఏయస్ రామకృష్ణ, మన్నవ మోహనకృష్ణ, లాల్వజీర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment