హైద్రాబాద్, మార్చి 14, (way2newstv.in)
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కొంత కసరత్తు చేసినా కొన్ని స్థానాల్లో క్లారిటీ రాలేదు. దీంతో తొలుత పార్లమెంటు స్థానాలపై కసరత్తులు ప్రారంభించారు. అసెంబ్లీ సీట్లలో సయితం కొత్త, పాత కలయికతో రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో 16వ తేదీన మొత్తం అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. తొలుత పార్లమెంటు స్థానాలను ఖారారు చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుసతోంది. తొలుత పార్టీ కోసం పనిచేసిన వాళ్లను, యువతకు అవకాశమివ్వాలనుకున్నా, గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని భావిస్తుండటంతో కొందరు సిట్టింగ్ లకు కూడా కోత పెట్టే అవకాశముంది.ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలకు అప్పుడే అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ఐదుగురు పార్లమెంటు సభ్యుల్లో ఈసారి తిరిగి ఒక్కరికే అవకాశమిస్తారని అంటున్నారు. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఉంటారన్నది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మిధున్ రెడ్డికి తిరిగి రాజంపేట కేటాయించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎంపీల జాబితా రెడీ
కడప నుంచి అవినాష్ రెడ్డికి, తిరుపతి నుంచి వరప్రసాద్ కు, నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డికి, ఒంగోలు నుంచి వైవీ సుబ్బారెడ్డికి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఛాన్సు ఉండదని తెలుస్తోంది.కడప లోక్ సభ స్థానానికి అవినాష్ రెడ్డి బదులు ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఒంగోలు నుంచి మాగుంట సుబ్బారెడ్డి పార్టీలో చేరితే ఆయనకు అవకాశమివ్వాలని, వైవీని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి కూడా మాగుంట పోటీ చేయాలనుకుంటే ఆయనకే అవకాశమివ్వాలని భావిస్తున్నారు. లేకుంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి స్థానంలో ఆయన తనయుడు మేగకాపటి గౌతమ్ ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తున్నారు.తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా నిన్న మొన్నటి వరకూ ఉన్న వరప్రసాద్ ను గూడూరు అసెంబ్లీ బరిలోకి దింపుతున్నారు. అక్కడి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నెం మధుసూదనరావును పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన కనుమూరి రామకృష్ణంరాజుకే జగన్ ఖరారు చేశారు. నంద్యాల పార్లమెంటు నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలలో ఒకరిని బరిలోకి దింపనున్నారు. రాజమండ్రి పార్లమెంటుకు మార్గాని భరత్, మచిలీ పట్నం నుంచి బాలశౌరి పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. గుంటూరు ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. అనంతపురం నుంచి రిటైర్డ్ ఉద్యోగి రంగయ్య, హిందూపురం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్, అరకు పార్లమెంటు నుంచి కుంభా రవిబాబు పేర్లకు జగన్ టిక్ పెట్టారంటున్నారు. విజయవాడ నుంచి నిన్ననే పార్టీలో చేరిన పొట్లూరి వరప్రసాద్, బాపట్ల నుంచి నందిగామ సురేష్, ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్, కావూరి సాంబశివరావు, కాకినాడ నుంచి అశోక్, నరసరావు పేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, అమలాపురం నుంచి మాజీ మంత్రి పినిపి విశ్వరూప్ కాని చింతా అనురాధ, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ పేర్లను ఓకే చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలలో ఒకరిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు లేదా వరడు కల్యాణి, విశాఖపట్నం నుంచి వీవీఎస్ చౌదరి, కరనూలు నుంచి బీవై రామయ్యయ, డాక్టర్ సంజీవ్ కుమార్ లలో ఒకరిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సామన్య కిరణ్ ను కాకుండా మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. మొత్తం మీద 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోం
No comments:
Post a Comment