Breaking News

26/03/2019

16 సీట్లపై గులాబీ వ్యూహాలు

హైద్రాబాద్, మార్చి 26 (way2newstv.in)
కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఏమీ మాట్లాడారన్న దానిపై ఆయన ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై కెసిఆర్ ఎప్పటికప్పుడు సంబంధిత నాయకులతో సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకుల వివరాలను తెప్పించుకొని వారికి ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఎక్కడైనా పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రచార కార్యక్రమాలు జరిగితే వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు, మంత్రులతో కెసిఆర్ ఫోన్‌లో మాట్లాడుతూ వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. అధికార పార్టీ వైపు అనుకూలంగా మార్చుకోవడంలో కెసిఆర్ పురోగతి సాధిస్తున్నారు. కెసిఆర్ అమలు చేసే వ్యూహం అభ్యర్థులకు కలిసివస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాలు, మండలాల వారీగా గెలుపు, ఓటముల వివరాలను తెప్పించుకొని అక్కడ అమలు చేయాల్సిన వ్యూహాలను నియోజకవర్గాల నాయకులతో పాటు సంబంధిత ఇన్‌చార్జీ మంత్రులకు ఆయన ఫోన్‌లో మార్గదర్శనం చేస్తున్నారు. 


 16 సీట్లపై గులాబీ వ్యూహాలు

అభ్యర్థులతో పాటు పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నూరిపోస్తూ గెలుపు తమదే అన్న ధీమాను కెసిఆర్ వారిలో కల్పిస్తున్నారు. కెసిఆర్ మార్గదర్శనంతో పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో ప్రచారంలో ముందుకెళుతుంది.పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలు ఇప్పటికే కెసిఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు బాధ్యతలను అప్పగించారు. కచ్చితంగా ఎంపిని గెలిపించడంతో పాటు అధిక మెజార్టీ వచ్చేలా చూసుకోవాలని ఆయన ఇప్పటికే మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఎలాగైనా 16 స్థానాలను గెలవాలన్న లక్షంతో కెసిఆర్ ముందుకెళుతున్నారు. చాలాచోట్ల గెలుపు ఈజీ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరోమారు మంత్రి వర్గ విస్తరణ ఉండడం కూడా సీనియర్ ఎమ్మెల్యేలకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎంపిలను గెలిపించుకునే బాధ్యత సీనియర్ ఎమ్మెల్యేలపై ఉండడంతో వారంతా గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు ప్రచారం చేయాలని అధినేత సూచించడంతో పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లరాదని పార్టీ అధ్యక్షుడు ఆదేశించిన నే పథ్యంలో అందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. 5 సం వత్సరాలుగా అమలు చేసిన పథకాలతో పాటు రాను న్న రోజుల్లో అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరిం చే పనిలో పార్టీ క్యాడర్ నిమగ్నమయ్యింది. ప్రస్తుతం కెసిఆర్ ప్రగతిభవన్ నుంచే ప్రచార తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో జరిగే మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. సభల్లో స్థానికంగా మాట్లాడాల్సిన విషయాల తో పాటు స్థానికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కెసిఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న కెసిఆర్ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు

No comments:

Post a Comment