హైద్రాబాద్, మార్చి 26 (way2newstv.in)
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నీటి సరఫరాను చేస్తున్న జలమండలి మొండి బకాయిలతో కుదేలవుతుంది. కోట్లాది రూపాయల మేరకు నల్లా బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో సంస్ధ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ విధంగా మిగులు బిల్లులు పేరుకుపోయి రూ. 600 కోట్లకు పైగా బకాయి తయారైంది.గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్లకు చెందిన కార్యాలయాల నుంచి దాదాపుగా రూ. 695 కోట్లు నీటి బిల్లులు బకాయిలు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి నీటి చెల్లించని మరుక్షణం నల్లా కనెక్షన్ కట్ చేయడం వాటర్ బోర్డు నిబంధన. కానీ అది సామాన్యుడి విషయంలోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య సంస్ధలకు వర్తించదు. అదే ప్రభుత్వ రంగ సంస్ధలు అయితే కేవలం లేఖలతో సరిపెట్టుకుంటారు. నగర వ్యాప్తంగా 25 డివిజన్ల పరిధిలో దాదాపుగా 30కి పైగా కేంద్ర, రాష్ట్ర, కార్పొరేషన్ల సంస్ధలకు సంబంధించిన కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాలకు తాగునీరు, మురుగునీటి నిర్వాహణ బాధ్యతలను జలమండలి నిర్వహిస్తుంది. ఆయా సంస్ధలకు 1787 నల్లా కనెక్షన్లను మంజూరు చేసిందిఇప్పటికే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించని పరిస్థితుల్లో ఉంది.
700 కోట్లకు చేరిన జలమండలి బకాయిలు
నీటి సరఫరా నిమిత్తం విద్యుత్ వాడకానికి గానూ జలమండలి ప్రతి నెల రూ. 85 కోట్లను చెల్లించాల్సి వస్తుంది. దానికి తోడు కరెంటు బిల్లు నిమిత్తం దాదాపు 600 కోట్ల మేరకు బకాయిలు పడిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితుల్లో సంస్ధకు రావాల్సిన బకాయిలన్ని వసూలు అయితే కానీ కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు.ప్రస్తుత జలమండలి పరిస్థితిని పరిశీలిస్తే..రాబడి అరకొరగా తయారైంది. సంస్ధకు మాత్రం నెలనెలా పెట్టే ఖర్చులు మాత్రం చాంతాడంత మాదిరిగా ఉంది. సంస్ధ నీటి సరఫరా, మురుగునీటి పారుదల నిర్వాహణకు ప్రతి నెలా రూ. 130 కోట్లకు పైగా వెచ్చిస్తుంది. బిల్లుల రూపంలో వచ్చేది మాత్రం రూ. 95 కోట్లు కంటే మించి వసూళ్లు కాని పరిస్థితి. ఇందుకు సంస్ధకు వాటర్ మీటర్ రీడింగ్, బిల్లులు వసూళ్లకు ఏజెన్సీ వ్యవస్ధ కూడా ఉంది. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అతికష్టం మీద వసూళ్లవుతున్న మొత్తంలో రూ. 35 కోట్లు జీత భత్యాలు, నిర్వహణలో పోతున్నాయి. కరెంట్ ఛార్జీల నిమిత్తం విద్యుత్ శాఖకు రూ. 50 కోట్లను మాత్రం చెల్లిస్తుంది. . ఆయా సంస్ధల నుంచి ప్రతి నెల రూ. 14 కోట్లు రావాల్సి ఉంది. కనీసం రూ. 5 కోట్లకు వసూళ్లు మించకపోవడంతో బిల్లులు చెల్లింపులకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. ఇందుకు నెలనెలా ఆయా కార్యాలయాలు వినియోగానికి సంబంధించి నెలవారీ బిల్లులను చెల్లించాల్సి ఉంది. కానీ ఈ చెల్లింపుల విషయంలో ఆయా కార్యాలయాలు నిర్లప్తతంగా వ్యవహరించడంతో కోట్లలో బకాయిలు పేరుపోయాయి.ప్రభుత్వ రంగ సంస్ధలకు చెందిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ బకాయిల కోసం ఆయా సంస్ధలకు లేఖలు, నోటీలు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు సన్నర్ధమవుతుంది. ఇందులో భాగంగా నల్లా కనెక్షన్లను కట్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం.
No comments:
Post a Comment