Breaking News

06/02/2019

నూతన సబ్సిడరీ పోలీస్ వెల్ఫేర్ స్టోర్ ప్రారంభించిన మాజీ మంత్రి , కమీషనర్

సిద్దిపేట, ఫిబ్రవరి 06 (way2newstv.in) 
సిద్దిపేట  పోలీస్ కమిషనరేట్ పరిదిలో ఉన్నటువంటి సిబ్బంది సంక్షేమంలో భాగంగా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో  లక్షల రూపాయలతో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ వెల్ఫేర్  స్టోర్ ను బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు,  పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతు సిబ్బంది సంక్షేమాని దౄష్టిలో ఉంచుకొని 8, 00,000 రూపాయలతో నిత్యావసర వస్తువుల క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులకు ,
 పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు మార్కెట్ రేటు కంటే తక్కువగా రేటుకు వస్తువులు దొరుకుతాయని తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ కమీషనరేట్ కావడంతో పోలీసు సిబ్బందికి  అవసరాలు ఉన్నాయని వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని  ఇప్పటికే ఉచిత సెలెన్ షాపును గతములో ఏర్పాటు చేయడం జరిగింది, శిక్షణ ద్వారా సిబ్బందికి ప్యూహాత్మక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పింపబడుతుంది. దీంతో పోలీసులు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుందిని గతములో  కమీషనరేట్ లో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ట్రాఫిక్ సిబ్బందికి కాలుష్య బరిన పడకుండా గతములో మాస్క్స్ పంపిణీ చేయడం జరిగింది. సిబ్బందికి అవసరమైన  అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. స్టోర్ మరియు టాస్క్ ఫోర్స్ ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటారు.


నూతన సబ్సిడరీ పోలీస్ వెల్ఫేర్ స్టోర్  ప్రారంభించిన మాజీ మంత్రి , కమీషనర్ 

టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ప్రారంభం
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 6 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా ఆధునీకరించిన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఈరోజు నుండి టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది యొక్క సేవలు అందుబాటులో ఉంటాయని  ఏసిపి, సిఐ, సిబ్బందిని కేటాయించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సేవలు వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి లా & ఆర్డర్ నర్సింహ్మా రెడ్డి, అడిషనల్ డిసిపి ఏఆర్ బాబురావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిద్దిపేట ఏసిపి రమేశ్వర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, సిసిఎస్  ఏసిపి హబీబ్ ఖాన్, స్పెషల్ బ్రాంచి ఏసిపి రవీందర్ రాజు, సిఐలు నందీశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, వెంకట్రామయ్య, టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్,  ఉమెన్ పిఎస్ సీఐ మున్వర్ షరీఫ్. ఆర్ఐలు డేవిడ్ విజయ్ కుమార్, గణేష్ కుమార్, రామకృష్ణ, ఓఎస్డి బాలరాజ్, సిద్దిపేట పట్టణ  మున్సిపల్ కౌన్సిలర్లు. ఎస్ఐలు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment