Breaking News

06/02/2019

పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎంల తనిఖీ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 06 (way2newstv.in) 
రానున్న పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తొలి విడత తనిఖీ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. దీనిలో భాగంగా చుడీ బజార్లో ఉన్న ఈవీఎం గోడౌన్ నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలోని బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లను చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్కు తరలించేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీజ్ చేయబడిన చుడీ బజార్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ను తెరిచారు. ఈ గోడౌన్లో ఉన్న దాదాపు 14వేల బి.యు, సి.యు, వివి ప్యాట్లను చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ గోడౌన్కు తరలించారు. 


 పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎంల తనిఖీ ప్రక్రియ ప్రారంభం

అడిషనల్ కమిషనర్లు అద్వైత్కుమార్ సింగ్, సందీప్జాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేష్, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పవన్, సి.పి.ఐకి చెందిన శ్రీకాంత్ల సమక్షంలో చుడీ బజార్ ఈవీఎం గోడౌన్ల సీల్ను తొలగించారు. దీనికి ముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన ప్రత్యేక గదులకు వేసిన తాళాలు, సీల్లను పరిశీలించారు. ఈ తాళాలు, సీల్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం వారి సమక్షంలోనే గదులను తెరిచి ఈవీఎంలను ప్రత్యేక వాహనంలో విక్టరీ ప్లేగ్రౌండ్కు తరలిస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోర్టుకేసులు ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు మినహా మిగిలిన ఈవీఎం, వివి ప్యాట్లను విక్టరీ ప్లేగ్రౌండ్కు తరలించిన అనంతరం సోమవారం నుండి తొలి విడత ఈవీఎంల చెక్కింగ్ ప్రారంభించనున్నట్టు కమిషనర్ దానకిషోర్ తెలియజేశారు.

No comments:

Post a Comment