శ్రీకాకుళం, ఫిబ్రవరి 05 (way2newstv.in)
బీజేపీ ప్రజా చైతన్య బస్సు యాత్రరెండవ రోజు కొనసాగింది. శ్రీకాకుళం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మీనారాయణ ప్రజా చైతన్య బస్సు యాత్రప్రారంభించిన విషయంతెలిసిందే. బుధవారం ఎచ్చెర్ల, ఆమదాలవలస, రాజాం, పాలకొండ నియోజకవర్గాలలో యాత్ర జరిగింది.
మమతది కోర్టు ధిక్కారణ
కన్నా మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా పనిచేస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు కొందరు రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం లేదని అన్నారు. బెంగాల్ లో సిబీఐ తన పని తాను చేసుకుంటుంటే సీఎం మమతా పోలీసులను ఉపయోగించి సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. కోర్డు ఆదేశాల ప్రకారం విధులు నిర్వహిస్తున్న సీబీఐ అధికారులను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అయన అన్నారు. ఇలా కోర్టు ధిక్కరణ చేస్తున్న మమతా బెనర్జీకి పలువురు ముఖ్యమంత్రులు మద్దతు పలకడం ఏమిటని ప్రశ్నించారు.
No comments:
Post a Comment