Breaking News

20/02/2019

ఇప్పుడు చంద్రబాబుకి బుధ్దోచ్చింది

అనంతపురం,ఫిబ్రవరి 20(way2newstv.in): 
ముప్పై ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన టీడీపీకి ఇప్పుడే జ్ఞానోదయం అయింది. కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాలర్ ఎగరేసి తిరగాలని టీపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీతో పాటు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై అయన  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తప్పులను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. 


ఇప్పుడు చంద్రబాబుకి బుధ్దోచ్చింది

ఢిల్లీ రాజకీయాలు వేరన్న రఘువీరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు.  ఏపీలో పొత్తులపై రఘువీరా రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై త్వరలో రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. 
రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి,  పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని పేర్కొన్నారు.  ఇక రైతు కోటయ్య మృతి వెనుక ఉన్న వివాదాల జోలికి తాము వెళ్లమని, వ్యవసాయ వ్యతిరేక విధానాలే కోటయ్య మరణానికి కారణమని భావిస్తున్నామని రఘువీరా తెలిపారు. 

No comments:

Post a Comment