Breaking News

18/02/2019

త్వరలో ప్రాణహిత బ్యారేజ్ పై రాకపోకలు

అదిలాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వంతెన పనులు మరో వారం రోజుల్లోపు పూర్తి కానున్నాయి. మూడు రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలతో పాటు ప్రజాసంబంధాలను మెరుగు పర్చే వంతెన నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటుంది. కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద రూ. 107.89 కోట్ల అంచన వ్యయంతో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రాణహిత నదిపై కాళేశ్వరం వద్ద రెండేళ్ల క్రితమే రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద వంతెన పనులు చివరి దశకు చేరుకోవడం మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా సంబంధాలు మెరుగు పడనున్నాయి. వంతెనపై రాకపోకలు ప్రారంభం అయినట్లయితే మూడు రాష్ట్రాల ప్రజలకు దూర భారం తగ్గనుంది. 


 త్వరలో ప్రాణహిత బ్యారేజ్ పై రాకపోకలు

కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి 2012 నవంబర్ 15న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని సిరొంచా తాలూక ధర్మపురి వరకు సుమారు 855 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించేందుకు రూ. 107.89 కోట్ల నిధులను మంజూరు చేసిం ది. వంతెన పనులను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కు అప్పగించగా 2015 నవంబర్ 23న వంతెన పనులను ప్రారంభించారు. 2018 నవంబర్ 22 నాటికి వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన వివాదంతో పాటు ప్రాణహితలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. వంతెన నిర్మాణంలో ప్రాణహిత నదిలో చేపట్టిన 18 ఫిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా మరో ఫిల్లర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలు వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నాటు పడవలను ఆశ్రయించి ప్రాణహిత నది దాటి ప్రయాణం చేసే వారు. ప్రస్తుతం వంతెన నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో నాటు పడవల కష్టాలు తీరనున్నాయి. ప్రాణహిత నదిలో ప్రాణాలను అరచేతి లో పెట్టుకొని నాటు పడవల్లో దశాబ్దాల కాలం గా ప్రయాణం చేయగా ప్రస్తుతం కష్టాలు తొలిగిపోనున్నాయి. ప్రాణహిత నదిపై వంతెన నిర్మా ణం పూర్తి అయితే మంచిర్యాల, పెద్దపల్లి,కొమురంభీం జిల్లాల ప్రజలకు దూరభారం తగ్గనుంది. ప్రస్తుతం రైలుమార్గంలో మహారాష్ట్రకు వెళ్లాలంటే 200 కిలోమీటర్ల దూరం ఉండగా వంతెన అందుబాటులోకి వస్తే మంచిర్యాల జిల్లా కేంద్ర వాసులకు 130 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇప్పటికే జయశంకర్ జిల్లా మహదేవపూర్ మం డలం కాళేశ్వరం వద్ద రేండేళ్ల క్రితం రూ.250 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకా చింతలపల్లి నుంచి కాళేశ్వ రం సమీపంలోనే మెట్‌పల్లి వరకు వంతెన నిర్మించారు. రాపన్‌పల్లి వద్ద ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు తుది దశకు చేరుకోవడంతో మూడు రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలు మెరుపడనున్నాయి

No comments:

Post a Comment