Breaking News

23/02/2019

కందుల కొనుగోళ్లకు కోర్రీలే...కోర్రీలు

నల్గగొండ, ఫిబ్రవరి 23, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో  కనీస మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారు..కందికి మద్దతు ధరగా రూ.5450ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల టన్నుల కందులు విక్రయానికి వస్తాయని ప్రభుత్వ అంచనాకనుగుణంగా మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కందుల కొనుగోళ్లను చేపట్టింది. ఇంకా రైతుల వద్ద దాదాపు 60 వేల టన్నుల కందులు ఉన్నట్టు అంచనా వేసింది.  ఇదే అదునుగా భావించిన దళారులు స్థానికంగా పీఏసీఎస్, మార్కెట్ అధికారులతో కుమ్మకై రైతులను నిలువునా దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులకు విక్రయించేందుకు తీసుకొచ్చిన కందులను రకరకాలుగా కొర్రీలు పెడుతూ మద్దతు ధర అందనివ్వడం లేదు. కొనుగోళ్ల ప్రక్రియకు దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. 


కందుల కొనుగోళ్లకు కోర్రీలే...కోర్రీలు

ఈ విక్రయం సమయంలోనే సదరు రైతు పట్టా పుస్తకం, తదితర పత్రాలను జిరాక్స్ తీసుకుంటున్నారు. తదనంతరం అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందంతో, దర్జాగా ఆ రైతుల పేరు మీదనే దళారులు మద్దతు ధరకు కందులను విక్రయిస్తున్నారు. దీనికిగాను అధికారులకు దళారులు పెద్దమొత్తంలో ముట్టజెప్పుతుండడం విశేషం.ఈ ఏడాది 1.39 లక్షల టన్నుల మేర కంది దిగుబడి ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో 25 శాతం కందులను కొనుగోలుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు దళారులు కొనుగోలు చేసే ధరకు వందల్లోనే వ్యత్యాసం ఉంటుంది. దాంతో రైతులు ప్రభుత్వానికి విక్రయించడం కంటే.. దళారులకు విక్రయిస్తేనే డబ్బులు త్వరగా అందుతాయని.. ప్రైవేటు వైపే మొగ్గు చూపేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే కేంద్రం 25 శాతం కొనుగోలు చేస్తామన్నా.. సరేనంది. కానీ ఈసారి ఆ పరిస్థితి తలకిందులవుతూ రూ.2 వేల నుంచి రూ.3వేలకు పైగా వ్యత్యాసం ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల బాట పట్టారు. దీనికితోడు కేంద్రం 67వేల మెట్రిక్ టన్నుల కంటే మించి ఒక్క గింజా కొనుగోలు చేసేది లేదని తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వంపై పిడుగు పడ్డట్టైంది. ఇప్పటికే రైతుల నుంచి మార్క్‌ఫెడ్, హాకా సంస్థలు దాదాపు 1,40,021 టన్నుల కందులను కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి రైతులకు మార్క్‌ఫెడ్, హాకాలు రూ.76364 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.226.53 కోట్లు మాత్రమే చెల్లించాయి. ఒకవేళ కేంద్రం 67 వేల టన్నుల కందులను కొనుగోలు చేస్తే.. రూ.140 కోట్ల వరకు అందుతాయి. మిగిలిన రూ.396 కోట్లురాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment