Breaking News

02/02/2019

ప్రతిదాంట్లో ప్రతిపక్షాల రాజకీయాలు

గుంటూరు, ఫిబ్రవరి 2  (way2newstv.in) 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో ఏ పీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు శనివారం పర్యటించారు. ఈ పందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. తరువాత  పసుపు కుంకుమ సంబరం, పింఛన్ల ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీకర్ మాట్లాడుతూ గుడిపూడిలో మహిళలు ఉద్యమంలా తరలి వచ్చారు. మహిళలు ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం చంద్రబాబు కు   శుభశూచకమని అన్నారు. అన్యాయంగా విభజించిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి భాట పట్టిస్తున్న చంద్రబాబుకే మళ్లీ మనం ఓటు వేయాలి.


 ప్రతిదాంట్లో ప్రతిపక్షాల రాజకీయాలు 
 
నాలుగున్నర సంవత్సరాల కాలంలో గుడిపూడి గ్రామంలోనే సుమారు 22కోట్ల రూపాయల పనులు జరిగాయి. అలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇదే అభివృద్ధి చేయడం జరిగింది. వృద్ధులు వికలాంగులు, వితంతువులను సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు 2వేలు చేయడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం ఎక్కడ మీటింగ్ పెట్టిన మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 10వేలు సంపాదన చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ కష్టపడి పనిచేసే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. రాష్ట్రంలో రాజకీయాలతో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి చేయడం జరిగింది. నిన్న కేంద్రం పెట్టిన బడ్జెట్లో రాష్ట్రం గురించి చెప్పింది, ఇచ్చింది శూన్యమని అన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ కు ఎలాంటి గుణపాఠం చెప్పామో,   మోడీకి ఆయన మద్దతుదారులకు అదే గతి పట్టించాలి. రాష్ట్ర ప్రజల సహకారంతో సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో లోటు బడ్జెట్లో సైతం అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నారు. ప్రతిపక్షాలు పసుపు కుంకుమ, పెన్షన్ల లోనూ రాజకీయాలు చేస్తున్నాయి. అలాంటి వారిని ప్రజలు తరిమి కొట్టాలని అయన అన్నారు.

No comments:

Post a Comment