Breaking News

15/08/2018

రాహుల్ పర్యటన అట్టర్ ప్లాప్ : దానం నాగేందర్

హైదరాబాద్, ఆగస్టు 15, (way2newstv.in)
రాహుల్ పర్యటన ఏమీ ఉద్ధరించలేదు. రాహుల్ కు సమాచారం ఇచ్చినోళ్ళకి అవగాహన లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ లో జరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. మంగళవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాహుల్ ఇంకా పరిణితి చెందాలని చెప్పారు. ముఖ్యమంత్రి మనసు ఎంత గొప్పదో అర్థం అవుతోంది.కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఉందా? గ్రేటర్ లో 50 వేల ఇండ్లు పూర్తయ్యాయి. సీఎం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఇంటింటికి వెళ్లి ఆడిగితే రాహుల్ గాంధీ నల్ల మొఖం వేసుకోవాల్సిందేనని అన్నారు. రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారు. కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక్కో కుటుంబంలో ఇద్దరు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్, రాహుల్ మాట్లాడటమా.రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతే. సెటిలర్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెసు కు లేదు. రాహుల్ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని అయన వ్యాఖ్యానించారు. సెటిలర్లను ఆకర్షించే ముఖాలు కాంగ్రెస్ లో ఉన్నాయా. బూతు కమిటీలు ఏర్పాటు కాకుండానే టెలీ కాన్ఫరెన్సు అంటూ రాహుల్ ను మోసం చేశారు. ఇది తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడుతుందని అన్నారు. అంతా కిరాయిగాళ్లను తీసుకొచ్చి షో చేశారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ తెలంగాణ గురించి మాట్లాడారా. మోదీతో ప్రవర్తించిన తీరుతోనే ఆయన ఆన్ ఫిట్ అని అర్థం అవుతోందని అయన విమర్శించారు. రాహుల్ పర్యటన అట్టర్ ప్లాప్ : దానం నాగేందర్

No comments:

Post a Comment