Breaking News

20/08/2018

భారీ వర్షాలతో రైతన్న విలవిల

మంచిర్యాల, ఆగస్టు 20, (way2newstv.in)
భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం జరిగి  ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు  మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో లో గత ఐదు  రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది.వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముందనే అంచనాకు అధికారులు వస్తున్నారు..  ఖరీఫ్లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.



భారీ వర్షాలతో రైతన్న విలవిల

గత ఐదు  రోజులుగా కురుస్తున్న బారి వర్షాలకు పంటపొలాలు మునిగి ఇసుక తెప్పలు పెట్టి రైతున్నలకు కోలుకొని దెబ్బతిశాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి,లక్షెట్టిపేట మండలంలోని  పలు గ్రామాలలో పంట పొలాలు జలమయమయ్యాయి  తమ పంటపొలాలు నిటమునిగి కోలుకొని దెబ్బతీశాయని తమ పరిస్థితి ఏమిటి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిమోటార్లు పైపులు షెడ్లు నీట మునిగి  లక్షలాది రూపాయల  ఆస్తినష్టం జరిగిందని రైతులు చెపుతున్నారు. పంటపొలాల్లో ఇసుక తెప్పలు బండరాళ్లు వచ్చి చేరాయని పంటపొలాల మీద ఆధారపడి బతుకుతున్న మాకు తగు న్యాయం చేయాలనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చెన్నూరు మండలంలోని బతుకమ్మ, సుద్దాల, నారాయణఫూర్ వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టు ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి..జైపూర్ మండంలోని కానుకూరి గ్రామంలోని టేకుమట్ల వాగు చెరువు కాలువకు గండి పడి పంటలు మునిగిపోయాయి. కుందారం చెరువు నిండిపోయి మత్తడిపై నుంచి పారడంతో పొలాలు, పత్తి చేలల్లో నీరు నిలిచింది..వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి తమ సమస్యలను పరిష్కరించాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు
==========================

No comments:

Post a Comment