Breaking News

14/07/2018

నష్ట నివారణ చర్యల్లో ప్రధాని మోడీ

లక్పో, జూలై 14 (way2newstv.in)
ఇమేజ్ డ్యామేజి అయిందని చెబుతున్న విపక్షాలకు, సర్వే సంస్థలకు నరేంద్ర మోడీ తన చర్యలతో చెక్ పెట్టదలచుకున్నారు. తానేంటో చూపించ దలచుకున్నారు.మోడీ వచ్చే ఏడు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 50 ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు నిర్ణయించాయి. ఒక్కో ర్యాలీ మూడు లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఉండేలా కమలనాధులు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ను మోడీ టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలు ప్రారంభమయ్యాయి. మరోసారి యూపీనే ఎంచుకున్నారు.  వరుసగా మోడీ యూపీలో పర్యటించనున్నారు. వారణాసి, మీర్జాపూర్, ఆజంఘర్ లలో ఆయన పర్యటన ఉంటుంది. ముఖ్యంగా యూపీలో విపక్షాలన్నీ ఏకమై ఉప ఎన్నికల్లో తనను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకమైనా తానేమోటో, తన సత్తా ఏమిటో, గోల్ ఏంటో ప్రజలకు పూసగుచ్చి మోదీ చెప్పనున్నారు.



నష్ట నివారణ చర్యల్లో ప్రధాని మోడీ

 రైతు వర్గాన్ని ఆకట్టుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరికి మద్దతు ధర రెండు వందల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అలాగే రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలను గురించి రైతు ర్యాలీల్లో వివరిస్తారు. ఇందుకోసమే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతు ర్యాలీలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీన యూపీలో రైతు ర్యాలీని నిర్వహించనున్నారు. అలాగే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రత్యేక పర్యటనలకు మోదీ ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు అమిత్ షా కూడా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. తమిళనాడు, బీహార్, తెలంగాణ పర్యటనలు పూర్తి చేసుకున్న అమిత్ షా రెండు నెలల్లోనే అన్ని రాష్ట్రాల పర్యటనలు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద మోడీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని జనం చేతే చెప్పించేందుకు రెడీ అవుతున్నారన్నమాట. తాను చేపట్టిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపిస్తున్నాయంటున్నారు. తనకు ప్రజాసేవే తప్ప కుటుంబం కూడా లేదని మరోసారి ప్రజల ముందుకు వెళ్లనున్నారు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు తాను చేస్తున్న కృషితో పాటు గత నాలుగున్నరేళ్లుగా తన ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటివల్ల ఎవరు లబ్ది పొందారో కూలంకషంగా వివరించనున్నారు. ఇలా మోడీ తన ఇమేజ్ తగ్గిందన్న ప్రచారం నిజం కాదనేది తన చేతల ద్వారానే నిరూపించుకోదలచుకున్నారు.ఎన్నికలు మామూలుగా జరిగినా ఇంకా పది నెలలు కూడా లేదు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి జైకేతనం ఎగురవేయాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల పట్టుదల. ఏమీ చేయకుండా, అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న యూపీఏ ప్రభుత్వం రెండుసార్లు వరుసగా రానిది లేదని, ఎటువంటి అవినీతి మచ్చ అంటకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న తమను ప్రజలు ఎందుకు ఆదరించరని ప్రశ్నిస్తున్నారు.నోట్ల రద్దు వల్ల ప్రజలు కొంత కాలం నగదు కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అని, ఇప్పుడు నగదు కొరత సమస్య లేదంటున్నారు. అలాగే జీఎస్టీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వచ్చే ఏడు నెలలు ఊపిరి సలపకుండా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

No comments:

Post a Comment