Breaking News

06/07/2018

చంద్రబాబుకు పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్

న్యూఢిల్లీ, జూలై 6, (way2newstv,in)
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న వైసీపీ ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలకు చేరువవడం ద్వారా వాళ్లను తమ వైపుకు తిప్పుకోవచ్చని భావించిన జగన్.. ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్ర మంతటా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే 200 పైచిలుకు రోజులు నడిచి.. టార్గెట్ వైపు దూసుకుపోతున్నాడు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల విషయంలో ఇప్పటి వరకు జనసేన మాత్రమే వైసీపీకి పోటీగా భావించేవాళ్లు. 



 చంద్రబాబుకు పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్

కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా రేసులోకొస్తోంది. ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో పాటు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోని రావాలని భావిస్తున్న జగన్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉందట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు వచ్చిన అది ప్రధాన ప్రతిపక్షానికే నష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా జగన్‌ను టార్గెట్ చేసే ఈ సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.కేంద్రంలో ఉన్న బీజేపీకి వైసీపీకి మధ్య ఏవేవో ఒప్పందాలు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తమకు మద్దతిచ్చేలా ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీలోని తమ పార్టీ నేతలకు ఫోన్ చేసి.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను టార్గెట్ చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపునకు తిప్పుకోవాలని సూచించాడట. అంతేకాదు పరోక్షంగా చంద్రబాబుకు సపోర్టు చేయాలని తన పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల సామర్ధ్యం చంద్రబాబుకు ఉండడం వల్ల ఆయనను కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఏపీ నేతలకు చెప్పారని సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా టీడీపీకి సపోర్టు చేయాలని డిసైడ్ అయిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment