Breaking News

25/07/2018

రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ

అమరావతి, జూలై 25 (way2newstv.in) 
రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న రోడ్ల పురోగతిని మంత్రి నారాయణ పరిశీలించారు. మరింత వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని ప్రధాన రోడ్లపై వాహనాలు తిరిగేలా చేస్తామని అన్నారు.  ఆల్ ఇండియా సర్వీసెస్... ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి . రాజధానిలో ఇటుక పడలేదని విమర్శలు అవివేకంతో అంటున్నారని మంత్రి అన్నారు.  షిర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణాలు జరుగుతున్నాయి..ఇటుకలతో కాదూ. అసలు రాజధాని పనులు జరగడం లేదు అనేవారు...ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడాలి. రాజధానికి 1500కోట్లు ఇచ్చి...కట్టుకోమని కేంద్రం చేతులు దులుపుకుంటే ఎలా సాధ్యమని మంత్రి ప్రశ్నించారు. గుజరాత్ లో 2500 కోట్లు ఒక్క పటేల్ విగ్రహానికి ఎలా కేటాయించారని అన్నారు. దేశంలో ఏ రాజధాని నిర్మించనంత వేగంగా అమరావతి లో పనులు జరుగుతున్నాయని అయన అన్నారు. డిసెంబర్ 31వ తేది నాటికి క్వార్టర్స్ నిర్మాణలు పూర్తి చేస్తామని  మంత్రి వెల్లడించారు. 



రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ

No comments:

Post a Comment