Breaking News

18/07/2018

అవిశ్వాసంతో కాంగ్రెస్ కు మైలేజ్

న్యూఢిల్లీ, జూలై 18 (way2newstv.com)
బడ్జెట్ సమావేశాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పూనుకున్నప్పుడు తొలుత దానిని గేలిచేసిన చంద్రబాబునాయుడు.. జగన్ కు ఎక్కడ మైలేజీ వచ్చేస్తుందో అనే భయంతో.. తానే అవిశ్వాసానికి పూనుకున్నారు. ఈసారి వర్షాకాల పార్లమెంటు సమావేశాల సమయానికి.. అసలు వైకాపాసభ్యులే లోక్ సభలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మైలేజీని తామే మూటగట్టుకోవాలనుకుంటూ.. చంద్రబాబు నాయుడు అవిశ్వాసం మళ్లీ పెట్టడానికి సిద్ధం అయ్యారు. అయితే.. ఆయన మైలేజీ ఆశలకు కాంగ్రెస్ పార్టీ గండికొట్టబోతున్నది.ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో తిరిగి నిలదొక్కుకోవడానికి నానాపాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. అనేక పార్టీ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే.. ఏపీ ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం తాము కట్టుబడి ఉన్నాం అనే సంకేతాలు పంపడానికి తగ్గట్లుగా.. కాంగ్రెస్ పార్టీ తరఫునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లుగా.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ ప్రకటించారు. సంఖ్యాపరంగా చూసినప్పుడు, తెలుగుదేశం కంటె.. కాంగ్రెస్ పార్టీ చాలా ఎడ్వాంటేజీ పొజిషన్ లో ఉంది.కాంగ్రెస్ తీర్మానం పెట్టడం అంటే.. దాదాపుగా యూపీఏ పక్షాలన్నింటి మద్దతు లభించినట్లుగానే అవుతుంది. ఈ క్రమంలో.. తెలుగుదేశం పెట్టబోయే తీర్మానం ప్రాధాన్యం తగ్గుతుంది.వైకాపా ఇప్పుడు లేదు, తెదేపా డ్రామాను రిపీట్ చేస్తోందని తామే కామెంట్ అనవచ్చు. అవిశ్వాసంతో  కాంగ్రెస్ కు మైలేజ్ 

తమిళ ఆవేశాలు తగ్గుముఖంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసం అనేది కనీసం చర్చకు వచ్చేలాగా చేయగలిగితే.. కాంగ్రెస్ కు చాలా మైలేజీ వస్తుంది. ఏపీ కోసం కాంగ్రెస్ తహతహలాడుతున్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ఆ పార్టీని రాష్ట్రంలో తిరిగి నిలబెట్టాలని కష్టపడుతున్న నాయకులకు కాస్త బలం అందించినట్లు అవుతుంది.నిబంధనల ప్రకారం ఒకేఒక్క సభ్యుడు అయినా సరే.. అవిశ్వాసం ప్రతిపాదించవచ్చు. కానీ, చర్చకు అవసరమైన బలం కూడా లేని, కేవలం 16మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ పెట్టే అవిశ్వాసానికి... 48మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తీర్మానానికి చాలాతేడా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కు ఎడ్వాంటేజీ ఉంటుంది.ఈ అన్ని సమీకరణాలను లెక్కలోకి తీసుకుని.. కాంగ్రెస్ వ్యూహాలకు ప్రస్తుతం పదును పెడుతున్న ఊమెన్ చాందీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టిందంటే.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రసకందాయంలో పడతాయి.

No comments:

Post a Comment