అనంతపురం, జూలై 17 (way2newstv.in)
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామ, వార్డు దర్శిని కార్యక్రమాన్ని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడానికి, వారి సమస్యల పరిష్కారానికే వార్డు దర్శిని, వార్డు వికాసం కార్యక్రమాన్ని చేపట్టాం. గడచిన నాలుగేళ్లలో రూ.3000 కోట్లతో రాయదుర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పేదల సంక్షమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది, పేదరికం లేని సమాజం ఏర్పరచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం. పట్టణాల్లో నివసించే ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాన్ని, ఇంటిని మంజూరుచేస్తున్నామని అన్నారు. ఫించను మొత్తాన్ని ఐదు రెట్లు పెంచాం, మహిళా స్వయంశక్తి సంఘాలకు పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందించి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. పేదల సంక్షేమం, అభివృద్ధికోసం కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యం
No comments:
Post a Comment