Breaking News

26/06/2018

నాలుగో విడత హరిత హారానికి అంతా సిద్ధం

వరంగల్, జూన్ 26, (way2newstv.in)
తెలంగాణ సర్కార్ హరితహారం పేరుతో 2015లో బృహోత్తమైన మొక్కలు నాటే కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక్క శాతం కూడా అటవి సంపద లేకపోవడంతో పెద్దఎత్తున మొ క్కలు నాటాలనే లక్ష్యంతో నాలుగో విడత హరితహారం కా ర్యక్రమానికి జిల్లా అదికార యాంత్రంగం సిద్ధమైంది. నాలుగో విడత హరితహారం జూలై రెండో వారం నుంచి ప్రారంభంకానున్నది. అయితే వర్షాల మీదనే ఆదారపడి ఉం టుంది. జూలై మొదటి వారం లేదా, రెండో వారంలో వర్షా లు సమృద్ధిగా పడే సూచనలు కనిపిస్తున్నందున వచ్చే నెల మొదటి పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్ర మాన్ని ప్రారంభించాలనే అంచనాతో అధికారులు ఉన్నారు. అందుకోసం నర్సరీలలో ఉన్న మొక్కలను నాటే చోట్లకు సరఫరా చేసే పనిలో నిమగ్నమయ్యారు.నాలుగో విడత హరిత హారానికి అంతా సిద్ధం

ఈ సారి లక్షాలాదిగా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ముందుస్తుగా మొక్కల పెంపకానికి ప్రణాళికలు రూపొందించింది. ఆరునెలలగా నర్సరీలలో మొక్కలను పెంచుతున్నారు. ప్ర స్తుతం ఏపుగా పెరిగి నాటడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో గత ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా 26 ప్ర భుత్వ శాఖల నుంచి మొక్కలు నాటనున్నారు. వీటిలో డీఆర్‌డీఏ 25 లక్షలు, కుడా 10 లక్షలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 12 లక్షలు, అటవీశాఖ ఒక లక్ష, వ్యవసాయశాఖ లక్ష, హారికల్చర్, సెరికల్చర్ లక్ష, ఎక్సైజ్‌శాఖ 3 లక్ష లు, పంచాయతీరాజ్‌శాఖ 15 వేలు, విద్యాశాఖ 15 వేలు, ఎన్పీడీసీఎల్ 2 లక్షల, సెంట్రల్‌జైల్ 15 వేలు, ఆర్‌అండ్‌బీ 5 వేలు, ఇరిగేషన్ 5 వేలు, దేవాదాయశాఖ 2 వేలు, రైల్వే 2 వేలు, సాంఘిక సంక్షేమశాఖ 4 వేలు, మెడికల్ అండ్ హె ల్త్ డిపార్ట్‌మెంట్ వెయ్యి, మార్కెటింగ్‌శాఖ 5 వేలు, ట్రైబల్‌వెల్ఫేర్ శాఖ వెయ్యి, మైనార్టీ డిపార్ట్‌మెంట్ వెయ్యి, పోలీసుశాఖ 8 లక్షలా పదివేలు, ఎస్సీ వెల్ఫేర్ వెయ్యి, బీసీ వెల్ఫేర్ వెయ్యి, ఆర్టీసీ ఐదు వందలు, పరిశ్రమలశాఖ పది వేలు, టీఎస్ ఐఐసీ 4,500 మొత్తం 62 లక్షల మొక్కలు నాటనున్నారు. నర్సరీలలో మాత్రం అదనంగా నాలుగు లక్షల మొక్కలు పెంచారు. నర్సీల నుంచి తీసుకువెళ్లే క్రమంలో కొ న్ని మొక్కలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో నాలుగు లక్షల మొక్కలు అదనంగా పెంచారు. హరితహారం మొక్కలను 11 రకాల స్థలాల్లో నాటడానికి జిల్లా అధికారులు స్థలాల జాబితాను సిద్ధంచేశారు. వ్యవసాయభూములు వద్ద టేకు, ఇళ్లల్లో పండ్ల మొక్కలు, చెరువుగ ట్లు, కాలువలకు ఇరువైపుల ఈత, రోడ్లు వెంట ఏపుగా పెరిగేవి, అటవీశాఖ భూముల్లో ఏపుగా పెరిగే మొక్కలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కుడా శాఖల నుంచి పండ్లు, పూల మొ క్కలు, నీడనిచ్చే మొక్కలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, విద్యాసంస్థల్లో ఏపుగా నీడ నిచ్చే మొక్కలను నాటనున్నారు. ఈసారి హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తం గా 66 లక్షల మొక్కలు నాటడాన్ని జిల్లా యాంత్రాంగం ల క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 34 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలలో అన్ని రకాల మొక్కలు నీడ నిచ్చేవి, పండ్లు, పూల మొక్కలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నా రు. పెంచిన మొక్కలన్నీ అర మీటర్ నుంచి మీటర్ ఎత్తులో ఉన్నాయి. జిల్లాలో ఆరు శాఖలనుంచి అటవీశాఖ, డీఆర్‌డీ వో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా, హార్టికల్చర్, సెరికల్చర్ శాఖల అధికారులు సొంతగా నర్సరీలను ఏర్పాటు చేసుకొని మొక్కలను పెంచారు. అటవీశాఖ 23 న ర్సరీలలో 36 లక్షల మొక్కలు పెంచింది. డీఆర్డీవో 7 నర్సరీల నుంచి 7 లక్షల, కుడా రెండు నర్సరీల ద్వారా 15 లక్షలు, హార్టికల్చర్, పట్టుపరిశ్రమశాఖ కలిపి 2 లక్షల మొక్కలను పెంచారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బయటినుంచి పది లక్షల మొక్కలను కొనుగోలు చేయనున్నదిసిటీలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, కుడా శాఖలనుంచి 25 లక్షలు, జిల్లాలోని ఐదు గ్రామీణ అసెంబ్లీ ని యోజక వర్గాలు స్టేషన్‌ఘన్‌పూర్‌లోని రెండు మండలాలు ధర్మసాగర్, వేలేరులో పదిన్నర లక్షలు, వర్ధన్నపేట నియోజకవర్గంలో హసన్‌పర్తి, ఐనవోలు 11 లక్షలు, హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పదిలక్షల, 70 వేలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీ మదేవరపల్లి మండలాల్లో 11 లక్షల మొక్కలు హరితహారం ద్వారా నటడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.

No comments:

Post a Comment