విజయవాడ జూన్ 26 (way2newstv.in):
బీజేపీ, వైసీపీలు లాలుచి తనానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్న గాలి జనార్దన్ రెడ్డి కోసం తమ్ముడు జగన్ తన సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచారని, ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కడప స్టీల్ ప్లాంట్ ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని, విభజన హామీలపై బీజేపీ నేతలు ప్రజల మధ్య మాట్లాడాలని డిమాండ్ చేసారు. బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా వాటి అజెండా ఒకటేనని అన్నారు.
లాలుచి తనానికి కేరాఫ్ అడ్రస్ బిజేపీ, వైసీపీలు.... టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటూ కొత్త మిత్రులు భాజాపా, వైకాపా నాయకులు సైందవుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీల అమలుపై భాజాపా నాయకులు ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని సవాల్ విసిరారు .కాగా, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రమంతా ఆందోళన చెందుతోందని అన్నారు. ఈ విషయమై వైసీపీ కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైసీపీ, బీజేపీ లు స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ 5 కోట్ల మంది ఆంధ్రులను నిలువునా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా డొక్కా విమర్శలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ట్వీట్లు చేయడం కాదని, వాస్తవాలు తెలుసుకుని పవన్ మాట్లాడాలని సూచించారు.కర్ణాటక ఎన్నికల్లో అందించిన ఆర్థిక సహకారానికి కడప స్టీల్ ప్లాంట్‌ను గాలి జనార్థన్‌రెడ్డికి బహుమానంగా ఇచ్చేందుకు యత్నిస్తూ కేంద్రం మరో క్విడ్ ప్రోకోకు తెరదీసిందని రాయపాటి ఆరోపించారు. జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్ నిర్మించడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన బహిరంగ విలేకర్ల సమావేశమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.
No comments:
Post a Comment