గుంటూరు, జూన్ 29 (way2newstv.in)
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో దుక్కు దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమంను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోనశశీధర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. తరువాత రైతులతో ఏర్పాటుచేసిన గ్రామసభ సమావేశంలో మంత్రి స్రసంగించారు. ఈ యేడు వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అభిలషించారు. మంత్రి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి నాడు రైతన్నలు దుక్కిదున్ని సాగును ప్రారంభించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. గడిచిన నాలుగేళ్లలో పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. సీఎం పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశారని అన్నారు.
రైతులకు అనేక సంక్షేమ పథకాలు
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని అన్నారు. వ్యవసాయ వృద్ధిరేటులో ఏపీ మొదటిస్థానంలో ఉంది. 87 లక్షల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే నని అన్నారు. 1.21 లక్షల టన్నుల మైక్రో న్యూట్రిఎంట్స్ రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రైతురథం పథకం కింద 12వేలకు పైగా ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వాలలో విత్తనాల కోసం రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పి.డి యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని అయన అన్నారు. బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మట్లాడుతున్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.
No comments:
Post a Comment