Breaking News

29/06/2018

పండుగ వాతావరణంలో ఏరువాక

ఏలూరు, జూన్ 29 (way2newstv.in)
జిల్లాలో సాగుసంబరం ఏరువాక పౌర్ణమి పండుగవాతావరణాన్ని తీసుకువచ్చింది . పెదపాడు మండలం కొక్కెరపాడులో గురువారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పెద్దఎత్తున రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఎడ్లబండిపై జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంఎల్ఎ బడేటి కోటరామారావు( బుజ్జి), డిసిసిబి చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), ఎంఎల్‌సి రాము సూర్యారావు రైతుల హర్షద్వానాలు, మహిళల కోలాటాల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో ఏరువాక కార్యక్రమానికి విచ్చేశారు. 



పండుగ వాతావరణంలో ఏరువాక

ఈ సందర్బంగా ఎడ్లను కడిగి రంగులుపూసి పూలదండలతో అలంకరించి ఎడ్లనుకట్టే కాడికి పసుపు, కుంకుమ, నవధాన్యాలు, దూపనైవేద్యాలతో పూజిస్తూ జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ , స్వయంగా ఎడ్లను తోలుతూ దుక్కిదున్నుతూ అందరినీ సంబ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు . అనంతరం జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ స్వయంగా వరినాట్లు యంత్రాన్ని నడపగా దానిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎంఎల్ఏ బడేటి బుజ్జి , ఎఎంసి చైర్మన్ లు మాగంటి సురేంద్రనాద్ చౌదరి, పూజారి నిరంజన్, నగరపాలకసంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు మాగంటి రాంజీ, తదితరులు వున్నారు. అనంతరం వ్యవసాయక్షేత్రంలో దిగి వరినాట్లు వేసేందుకు ఆకుమడులను జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, జా యింట్ కలెక్టర్ -2 ఎం హెచ్ షరీఫ్, ఎంపిపిలు మోరు శ్రావణి, పప్పుల సుశీల, బక్కయ్య, వ్యవసాయశాఖ జెడి గౌషియా బేగం, మత్స్యశాఖ జెడి డా.అంజలి, ఉధ్యానశాఖ డిడి టివి సుబ్బారావు, మార్కెటింగ్ ఎడి నాగమల్లిక, తాహసిల్దార్ కుమార్, ఎంపిడిఒ ఆశీర్వాదం, మాజీ జడ్‌పిటిసి గారపాటి రామసీత, నీటి సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకటరావు, తెలుగుదేశం నాయకులు వివి రామప్రసాద్ తో పాటు వివిధశాఖల జిల్లా, మండల అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు మహిళలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment