Breaking News

29/01/2020

జగన్ సాహసోపేత నిర్ణయాలతో దూకుడు

హైద్రాబాద్, జనవరి 29  (way2naewstv.in)
జగన్ రాజకీయ ప్రవేశం ఓ పెద్ద సంచలనం. అసలు ఆయన సీఎం అవడం ఇంకా సంచలనం. పదకొండేళ్ళ పొలిటికల్ కెరీర్ లో జగన్ జాతీయ స్థాయిలో కూడా చర్చించుకునే కీలక నేతగా మారారు. ఆయన ఈ మధ్యనే ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని బెస్ట్ సీఎంలలో నాలుగవ ర్యాంక్ సాధించారు. ఇక జగన్ వరసగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత పాలనకు భిన్నంగా ఆయన తాను ఎందుకు అధికారాన్ని కోరుకున్నానో ఆ పని ఎవరికీ బెదరక అదరక కానిచ్చేస్తున్నారు. వ్యవస్థలను ప్రక్షాళయన చేయడమే తన లక్ష్యమని జగన్ అంటూ వచ్చారు, ఇపుడు ఆ దిశగానే దూకుడుగా అడుగులు వేస్తున్నారు. శాసనమండలితో ఈ కధ మరింత పదునెక్కినంది.ఇక జగన్ మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నారట. 
జగన్ సాహసోపేత నిర్ణయాలతో దూకుడు

అదేంటి అంటే మాజీ ప్రజాప్రతినిధుల పించన్లను ఇకపై పూర్తిగా ఎత్తివేయడమట. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఒక్కసారి పనిచేసినా కూడా వారికి ప్రతి నెల పించను వస్తుంది. అది చాలా పెద్ద మొత్తంలో కూడా ఉంటుంది. పైగా వారికి ఎన్నో సదుపాయాలు కూడా ఉంటాయి. వీటి వల్ల ప్రభుత్వానికి వందల కోట్లలో బడ్జెట్ పడుతోంది. దీని మీద ఇపుడు జగన్ సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారుట. మాజీలకు పించన్లు కట్ చేయడం అంటే రాజకీయంతో తల గొక్కోవడమే. కానీ జగన్ మాత్రం దీన్ని ఎలాగైనా చేయాలనుకుంటున్నారుట.ఏపీ విషయానికి వస్తే పేద రాష్ట్రం, భారీగా లోటు ఉన్న రాష్ట్రం, అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు లెక్క తీస్తే అచ్చంగా 1300 పై చిలుకు ఉన్నారట. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే చాలు ఇక భరోసా ఆర్ధికంగా ఉంటుంది. పింఛ‌ను ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా జీవితకాలం వస్తుంది. ఇక ఆయన చనిపోతే సతీమణికి కూడా కుటుంబ పింఛ‌ను వస్తుంది. మారిన పరిస్థితుల్లో మనిషి జీవిత కాలం కూడా పెరుగుతోంది. దాంతో ప్రతి అయిదేళ్ళకు మాజీల సంఖ్య ఓ వైపు పెరుగుతూంటే వెటరన్ పార్లమెంటేరియన్లకు తోడు అవుతున్నారు. దీంతో ఎక్కడ లేని ఆర్ధికభారం పడుతోందట. అయితే ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాబట్టి ఏ ఒక్క పాలకుడూ దీన్ని ముట్టుకోలేడు. పైగా తాము కూడా రేపటి రోజున ఈ ఆర్ధిక ప్రయోజనాలు పొందుతామన్న ఆశ వారికీ ఉంటుంది.కానీ జగన్ మాత్రం ఖజానాకు భారమయ్యే ప్రతీ విషయంపైనా సీరియస్ గానే ఉంటున్నారు. మండలి రద్దుని ఒక్క ముక్కతో తేల్చేసిన జగన్ ఇపుడు మాజీ ప్రజా ప్రతినిధులకు పించన్లు తీసేసే విషయంలో కూడా దూకుడుగా వెళ్ళాలనుకుంటున్నారు. నిజానికి ఈ విషయంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ప్రజా సేవ పేరిట పదవులు తీసుకుంటూ ఆ ప్రజలు కట్టే పన్నులతో జీతాలు, భత్యాలు అనుభవించడమే కాకుండా పదవీ విరమణ అనంతరం పింఛ‌న్లు తీసుకోవడం దారుణమన్న భావన అంతటా ఉంది. దీని మీద కోర్టులో ప్రజావ్యాజ్యాలు కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జగన్ కఠినంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయ నేతలు ఆగ్రహించినా జనం నుంచి జేజేలు అందడం ఖాయమని అంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టి మాజీల పింఛ‌న్ల కధకు ముగింపు పలకాలని జగన్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment