Breaking News

29/01/2020

15 బస్టాండ్ లలో మినీ సినిమా ధియేటర్లు

హైద్రాబాద్, జనవరి 29, (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్‌లలో ఇక మినీ సినిమా థియేటర్లు ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ స్థలాల్లో మినీ సినిమా థియేటర్లను నిర్మించడానికి రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. తొలుత 15 బస్టాండ్‌లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కార్యచరణ ప్రణాళకను సిద్ధం చేశారు.నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల వైపు మళ్ళించడానికి సంబంధిత ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో ఆదాయ మార్గాలను వెతుకుతున్నారు. నిధుల కోసం ప్రభుత్వాన్ని అడగకుండా స్వంత ఆస్తులతో ఆదాయాలను పెంచుకోవడానికి ఆర్టీసీ అధికారులు వివిధ రంగాలతో చర్చలు కొనసాగిస్తున్నారు. 
 15 బస్టాండ్ లలో మినీ సినిమా ధియేటర్లు

తెలంగాణలో 97 బస్సు డిపోలు, 358 బస్టాండ్‌లు ఉన్నాయని అధికారులు గుర్తు చేశారు. ఆదాయాలను పెంచుకోవడానకి ఇప్పటికే వివిధ రూట్లను ప్రైవేట్ యాజమాన్యులకు అప్పజెప్పడం జరిగిందన్నారు. మినీ థియేటర్ల ద్వారా ప్రతియేటా మూడు నుంచి పదకొండు కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుందని సర్వేలో తేలిందన్నారు. విజయవాడ బస్టాండ్‌లో మినీ థియేటర్ ద్వారా ఆంధ్రా ఆర్టీసీకి ఆదాయం చేకూరుతోందని చెప్పారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు., కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్,సిరిసిల్ల, పెద్దపల్లి, జడ్జర్ల, షాద్‌నగర్, నర్సాపూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్,చేవేళ్ళ, తాండూర్, వికారాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ బస్టాండ్‌లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు తమ నివేదికల్లో తెలిపారు.

No comments:

Post a Comment