Breaking News

28/01/2020

ఆర్ధిక సంఘం అధ్యక్షుడితో మంత్రి హరీష్ రావు భేటీ

న్యూ ఢిల్లీ జనవరి 28 (way2newstv.in)
15 వ ఆర్థిక సంఘము చైర్మన్ నందకిశోర్ సింగ్ తో తెలంగాణ ఆర్ధిక శాఖ  మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు, మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని హరీష్ రావు కెరారు. 
 ఆర్ధిక సంఘం అధ్యక్షుడితో మంత్రి హరీష్ రావు భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్ కు అందజేసారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం దృష్టికి మంత్రి  తీసుకెళ్లారు.

No comments:

Post a Comment