Breaking News

28/01/2020

మేడారం జాతరకు సర్వం సిద్ధం

కాటారం జనవరి 28, (way2newstv.in)
ఐదు మండలాల కూడలి అయిన కాటారం మండలం నుండి 50 బస్సులు భక్తులను చేరవేయడంకు సిద్ధం చేసారు.  కాటారం మండల కేంద్రంలో మేడారం జాతర కి వెళ్లే బస్సును జడ్పీ చైర్పర్సన్  జక్కు శ్రీ హర్షిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ "వనదేవతలను  దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 వేల స్పెషల్ బస్సులు మేడారం  జాతరకు ఏర్పాటు చెయ్యగా, దానిలో భాగంగా ఐదు మండలాల కూడలి అయినా మన కాటారం మండల కేంద్రం నుండి 50 బస్సులు మేడారం జాతర కి భక్తులను చేరవేయనున్నాయని అన్నారు. 
మేడారం జాతరకు సర్వం సిద్ధం

భక్తుల అవసరాల దృష్ట్యా మరిన్ని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతే కాకుండా మేడారంని ప్లాస్టిక్ రహిత మేడారంగా తీర్చి దిద్దుకోవాలి కనుక ఎవరూ కూడా ప్లాస్టిక్ ని ఉపయోగించకుండా ఇంటివద్ద నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచ్ తోట రాధమ్మ, కాటారం ఎంపీటీసీ2 తోట  జనార్దన్, పీఏసీ చైర్మన్ శంకరయ్య, భూపాలపల్లి బస్సు డిపో మేనేజర్ వంశీ, తెరాస మండల ప్రెసిడెంట్ అర్జయ్య, తెరాస మహిళా మండలి అధ్యక్షురాలు సౌజన్య,  ఇతర తెరాస నాయకులు,కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment