Breaking News

28/01/2020

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది: మాజీ మంత్రి దేవినేని

అమరావతి జనవరి 28  (way2newstv.in)
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా  ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కర్ణాటక రైతులను  అరెస్టు చేయడం అక్రమమని దేవినేని వైసీపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది: మాజీ మంత్రి దేవినేని

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు కర్ణాటక నుంచి వచ్చిన రైతులను పోలీసులు అరెస్టు చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు అన్న విషయం తెలుసుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణలంక పోలీసుస్టేషన్ కుఅమరావతి పరిరక్షణ సమితి, జెఏసి సభ్యులతో కలిసి రైతులను కలిసి వారికి దైర్యం చెప్పి పోలీసులతో మాట్లాడి వారిని పోలీస్ స్టేషన్ నుండి విడిపించి బయటకు తీసుకువచ్చారు.

No comments:

Post a Comment