విశాఖపట్నం జనవరి 31 (way2newstv.in)
శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించాము. కేంద్రానికి ఉన్న ప్రొసీజర్స్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదు అన్ని చట్టప్రకారం గానే జరుగుతాయని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం విశాఖ విమానాశ్రయం కు చేరుకున్న స్పీకర్ కు స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
చట్ట ప్రకారమే మండలి రద్దు
తమ్మినేని మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మండలి రద్దు చేయడం జరిగింది. రాజధాని ప్రాంత రైతులు తో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుంది. రైతులతో పాటు రైతు కూలీలు కూడా పెన్షన్ అందజేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ప్రజల ఉద్యమం జరిగితే దానికి అందరూ మద్దతు ఇద్దామని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment