జనగామ జనవరి 31 (way2newstv.in)
జనగామలోని ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment