Breaking News

29/01/2020

పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో రాజకీయనేతలు

కరీంనగర్, జనవరి 29, (way2newstv.in)
 ఎన్నికల ప్రక్రియలో ఓటమిని చవిచూసిన పోటీ అభ్యర్థులు ఆర్థిక సంక్షోభంలో చిక్కు కున్నారు. చెప్పలేనిస్థాయిలో ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం పోటీ అభ్యర్థులకు అప్పులిచ్చిన రుణదాతలు ఒత్తిడిని పెంచుతున్నారు. ఇచ్చిన అప్పులు తీర్చాలంటూ పట్టుబిగిస్తున్నారు.పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ నియోజక వర్గాల్లోని దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఈ ఆర్ధిక సంక్షోభం పోటీ అభ్యర్థుల్లో నెలకొంది.తమకు ఏర్పడిన ఈ ఇబ్బందులను బయటికి చెప్పుకోలేక పోటీ అభ్య ర్ధులు రాజకీయ సంఘ జీవనంలో సతమతమవుతున్నారు. 
పీకల్లోతు  ఆర్థిక నష్టాల్లో రాజకీయనేతలు

అసలు విషయానికి వస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఈ తతంగంలో పోటీ అభ్యర్ధులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ పడిన ప్రధాన పార్టీ అభ్యర్ధులతో పాటు స్వతంత్ర అభ్యర్దులు ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రాతిపదికన రూ. లక్షలాది రూపాయలు ఎన్నికల ప్రచారంలో వెచ్చించారు. పార్టీ అభ్యర్ధులతో సరిసమానంగా చిన్నా చితక పార్టీ టికెట్టుతో పోటీ పడిన అభ్యర్ధుతో పాటు స్వతంత్ర అభ్యర్ధిని ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చారు.ఎన్నికలు జరగడానికి ఏడాది కాలం ముందుగానే ఎమ్మెల్యే పదవిపై ఆశావాహులుగా ఉన్న నాయకులు ప్రజల్లో రకరకాల కార్యక్రమాల పేరుతో రూ. వేలాది రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన పోటీ అభ్యర్ధులు ఎన్నికల తరువాత ఆర్ధిక సమస్యను జఠిలంగా ఎదుర్కొంటున్నారు.ఇదే క్రమంలో నియోజక వర్గాల్లోని గ్రామ పంచాయితీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడిన వందలాది మంది పోటీ అభ్యర్ధుల పరిస్థితి ఆర్ధికంగా అద్వాన్నంగా తయారైంది. ఎన్నడూ లేని విధంగా రూ. లక్షల్లో ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లో వెచ్చించారు. ఈ దుర్భర పరిస్థితుల్లో సర్పంచ్ పదవులకు పోటీపడిన చాలా మంది రూ. లక్షల్లో అప్పలు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కానీ అపజయం పొందిన పోటీ అభ్యర్ధులకు ఈ ఎన్నికల్లో చేసిన అప్పులు గుదిబండగా మారాయి. ఈ అప్పులను తీర్చాలంటూ అప్పులు ఇచ్చిన వారు ఓడి పోయిన అభ్యర్ధుల చుట్టూ తిరుగులాడుతున్నారు.ఇండ్ల ముందు బైటాయిస్తున్నారు. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం కోసం పోటీ అభ్యర్ధులకు సంబంధించిన వారి కోసం భోజనాలను సమకూర్చిన క్యాటరింగ్ వర్గాలు కానీ, ప్రచార సాధనాలను ఏర్పాటుచేసిన వ్యాపారులుకానీ, తమకు రావాల్సిన బకాయిల కోసం పోటీ అభ్యర్ధులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో... ఈ ఎన్నికల్లో కోల్పోయిన ఆర్థిక అప్పులను తీర్చడం కోసం తమకున్న ఆస్తిపాస్తులను పలువురు ఓడిపోయిన అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు.కొన్ని చోట్ల పోటీ అభ్యర్థుల ఇండ్లల్లో ఉన్న వస్తువులను అప్పులు ఇచ్చిన వారు కొందరు కొన్ని గ్రామాల్లో తీసుకువెల్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆర్థ్ధిక సంక్షోభంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ప్రాణసంకటంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఓడిపోయిన పోటీ అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓట్ల కోసం కొన్ని వర్గాలను శరణు కోరడంతో పాటు కొంత నగదు బహుమతిని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల నిర్మాణాలకు ప్రాధమిక ఖర్చులను కూడా చేశారు.అయితే ఓటమిని పొందిన పోటీ అభ్యర్ధులు ముఖ్యంగా గ్రామాల్లో పలువురికి ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వాలంటూ తన అనుచరులతో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిస్థితి గ్రామాల్లో అనారోగ్య పరిస్థితులను నెలకొల్పుతున్నాయి. పలు వర్గాల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి.

No comments:

Post a Comment