Breaking News

11/01/2020

ఆరొందల కోట్ల అప్పు లకు ఆర్టీసీ వేట

హైద్రాబాద్, జనవరి 11(way2newstv.in)
ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ మళ్లీ లోన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా రూ.600 కోట్ల రుణం కావాలని ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌‌‌‌ బిల్లులు క్లియర్‌‌‌‌ చేయడానికి, ఇతర అవసరాలకు ఈ మొత్తం అవసరమని ప్రపోజల్స్ రెడీ చేసి ఆమోదం కోరుతూ ఫైలు పంపించింది. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో ఆర్టీసీ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.ఇటీవల చార్జీల పెంపుతో ప్రస్తుతం సంస్థకు అదనపు ఆదాయం వస్తున్నప్పటికీ జీతాలు, నిర్వహణకే సరిపోతోంది. డిసెంబర్‌‌‌‌ నెల జీతాలు కూడా ఆర్టీసీనే సొంతంగా చెల్లించుకుంది. కానీ అనేక పెండింగ్‌‌‌‌ బిల్లులను పే చేయాల్సి ఉంది. డిసెంబర్‌‌‌‌17లోగా సీసీఎస్ బకాయిలు చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. మరోవైపు బకాయిలు చెల్లించాలని పీఎఫ్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయి. 
 ఆరొందల కోట్ల అప్పు లకు ఆర్టీసీ వేట

వీటితోపాటు ఇతర అవసరాలకు డబ్బులు కావాలి. వీటన్నింటిని ఒకేసారి కాకుండా విడతలవారీగా కొద్దికొద్దిగా ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలను రిక్వెస్ట్‌‌‌‌ చేయాలని చూస్తున్నారు. కాగా, 2019 నవంబర్‌‌‌‌ 21 నాటికి ఆర్టీసీకి రూ.2,958.57 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో రూ.845.09 కోట్ల ప్రభుత్వ రుణాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే రూ.2,113.48 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది.2019 నవంబర్‌‌‌‌ నాటికి ఆర్టీసీ వివిధ వర్గాలకు రూ.2,209.66 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈపీఎఫ్‌‌‌‌కు రూ.788.30 కోట్లు, సీసీఎస్‌‌‌‌కు రూ.500.95 కోట్లు ఇవ్వాలి. 2014 నుంచి 2018 వరకుగాను రూ.180 కోట్లు ఎన్‌‌‌‌క్యాష్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించాలి. రిటైర్డ్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ సెటిల్మెంట్స్‌‌‌‌ రూ.52 కోట్లు, మోటారు వెహికిల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రూ.452.36 కోట్లు, డీజిల్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ బిల్స్‌‌‌‌ రూ.34.45 కోట్లు, ఇతర చెల్లింపులకు రూ.36.40 కోట్లు, ప్రైవేట్‌‌‌‌ హైర్‌‌‌‌ బస్సులకు రూ.25 కోట్లు, బస్‌‌‌‌ బాడీల తయారీకి రూ.60 లక్షలు, ఛాసిస్‌‌‌‌ సరఫరాదారులకు రూ.74.60 కోట్లు, రుణాల తిరిగి చెల్లింపులకు రూ.65 కోట్లు కావాలి.డిసెంబర్‌‌‌‌ 17వ తేదీలోగా సీసీఎస్(క్రెడిట్ అండ్ కో ఆపరేటివ్ సొసైటీ) బకాయిలు రూ.200 కోట్లు చెల్లించాలని సమ్మె సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం సీసీఎస్‌‌‌‌కు మొత్తంగా రూ.500.95 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కారం కిందకు వచ్చే అవకాశం ఉందిబకాయిలు చెల్లించాలంటూ సమ్మె సమయంలోనే నవంబర్‌‌‌‌ 18న పీఎఫ్ ఆఫీస్ నుంచి ఆర్టీసీకి ప్రాసిక్యూషన్‌‌‌‌ నోటీసులు వచ్చాయి. ఉద్యోగుల వాటాకు సంబంధించి కనీసం రూ.332.31 కోట్లు వెంటనే చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకుంటే ప్రాసిక్యూషన్‌‌‌‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కాంట్రిబ్యూషన్‌‌‌‌ కింద మరో రూ.455.99 కోట్లు చెల్లించాలి. మొత్తంగా పీఎఫ్‌‌‌‌కు 788.30 కోట్ల బకాయిలు ఉన్నాయి.

No comments:

Post a Comment