తిరుమల తిరుపతి జనవరి 11 (way2newstv.in)
తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారి మారినప్పుడల్లా పాలసీలు మారుస్తుంటారు. దీనితో అధికారులు చేసే పనులపై విమర్శలు వెల్లువలా వస్తుంటాయి. ఆలయం, పవిత్రత లాంటి విషయాల కన్నా ఆర్ధిక విషయాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త ట్రస్టులు పుట్టుకొస్తుంటాయి. అలా కొత్తగా పుట్టుకొచ్చిన ట్రస్టు శ్రీవాణీ ట్రస్టు. శ్రీవాణీ ట్రస్టు పెట్టిన ఉద్దేశ్యాలు ఏమిటి? ఎందుకు పెట్టారు?అన్నది సర్వత్రా చర్చ.టిటిడి డిప్యూటీ కార్యనిర్వహణాధికారిగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించగానే ఏర్పడిన ఈ ట్రస్టు చేసేది కూడా అదే. హిందూ ధర్మ ప్రచారానికి కొత్తగా చేసేది ఏమీ లేకపోయినా ఈ శ్రీవాణి ట్రస్టు ఎందుకు పెట్టారో ఎవరికీ అర్ధం కాదు. శ్రీవాణి ట్రస్టు హిందూ ధర్మ ప్రచారానికి నిర్దేశించినదట. పైన చెప్పినవి కాకుండా ఇంకా చేసేందుకు ఏముంటుంది? దీని కోసం ప్రత్యేక ట్రస్టు ఎందుకు? తెలియదు.
శ్రీవాణీ ట్రస్టు పెట్టిన ఉద్దేశ్యాలు ఏమిటి?
శ్రీవాణి ట్రస్టు కు పది వేల రూపాయలు విరాళం ఇచ్చిన వారికి దర్శనం ఫ్రీ అని నిబంధన పెట్టారు. హిందూ ధర్మ ప్రచారానికి టిటిడికి విరాళాలు ఇచ్చేవారు దానికి ఆపేసి శ్రీవాణి ట్రస్టు కు ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే పురాతన కాలం నుంచి ఉన్న ట్రస్టును చంపేసి కొత్త ట్రస్టును పెంచుతున్నారు ఎందుకు? ఆ వేంకటేశ్వరుడికే తెలియాలి.ట్రస్టుకు విరాళాలు ఇస్తే దర్శనం ఫ్రీగా చేయించడం ఏమిటి? దీనికోసం మిగిలిన దర్శనాలు నిలిపివేయడమేమిటి? ఒక ట్రస్టును ఇంతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఆ వేంకటేశ్వరుడికే తెలియాలి. శ్రీవాణి ట్రస్టు కు పదివేల రూపాయలు విరాళం ఇచ్చే విషయాన్ని దర్శనం కోసం వెళ్లిన ప్రతి ఒక్కరికి డిప్యూటీ ఈవో చెబుతూ ఉంటారు. విఐపి లెటర్లు తీసుకెళ్లేవారిని శ్రీవాణి ట్రస్టు వైపు నకు మళ్లిస్తున్నారు.శ్రీవాణి ట్రస్టు కు విరాళాల కారణంగా హుండీలో వేసే డబ్బులు కూడా వారు వేయడం లేదు. ఎటూ దేవాలయానికే విరాళం ఇస్తున్నాం కదా అని వారు అనుకుంటున్నారు. ఈ విధంగా వసూలు చేసిన ట్రస్టు డబ్బులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారండీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు.అన్నది చర్చనీయాంశమైంది.తిరుమల తిరుపతి దేవస్థానాలు దేశంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏనాడో రూపొందించింది. 1987 లో టిటిడి చట్టం 30 ప్రకారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు.హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో భాగంగా టిటిడి దేశంలో దేవాలయాలు నిర్మించేందుకు పెద్ద ఎతున విరాళాలు అందచేస్తుంది. ఇటీవలె 30 కోట్ల రూపాయలతో ముంబయిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని టిటిడి నిర్మిస్తున్నది.అలాగే జమ్మూ కాశ్మీర్ లో శ్రీ వేంకటేశ్వరుడి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అమరావతిలో, బెంగళూరులో ఇలా దేశంలోని చాలా చోట్ల టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాలు నిర్మించారు. ఇంకా నిర్మిస్తున్నారు కూడా. అంతే కాదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో కూడా వివిధ దేవాలయాల నిర్వహణకు ధర్మ ప్రచార పరిషత్ నిధులు ఇస్తూ ఉంటుంది.శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాలకే కాదు. ఏ వైష్ణవ దేవాలయానికి అయినా ధర్మ ప్రచార పరిషత్ నిధులు ఉదారంగా ఇస్తూ ఉంటుంది. నిత్య ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు మంజూరు చేస్తుంటారు. ఎన్నో దేవాలయాలోని అర్చకులకు ధర్మ ప్రచార పరిషత్ జీతాలు కూడా ఇస్తూ ఉంటంది.తిరుమలలో ఉన్న వేద పాఠ శాల నుంచి శిక్షణ పూర్తి అయిన వారికి వివిధ దేవాలయాలలో ఉద్యోగాలు కూడా కల్పిస్తుంటారు. దేవాలయాల నిర్మాణం, దేవాలయాల నిర్వహణ, నిత్య ధూప దీప నైవేద్యాలకే కాదు. దేవాలయాల్లో మైకు సెట్లు కొనేందుకు కూడా టిటిడి విరాళాలు ఇస్తూ ఉంటుంది.ఐదు వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల విలువ చేసే మైకు సెట్లను వివిధ దేవాలయాలకు టిటిడి ఇస్తుంది. మరీ ముఖ్యంగా దళిత వాడలలో ఉండే దేవాలయాలకు టిటిడి విశేష ప్రాధాన్యతనిస్తుంది. దళిత వాడల్లో దేవాలయాలు నిర్మిస్తే వాటికి విరాళాలు ఇవ్వడమే కాకుండా నిర్వహణ బాధ్యతను కూడా టిటిడి స్వీకరిస్తుంది.ఇలా ఒక్కటేమిటి హిందూ ధర్మ ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు తీసుకోని చర్య లేదు. ఏ విధంగా కావాలన్నా సహకరిస్తారు. దళిత వాడల్లో ఆ మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణాలు నిర్వహించారు. తిరుమల నుంచి విగ్రహాలు తీసుకువచ్చి తిరుమల అర్చక స్వాములే కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఇంతకన్నా హిందూ ధర్మ ప్రచారానికి ఏం చేయాలి? దీన్ని కొనసాగిస్తే చాలు.రాష్ట్రం దేశం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. మనకు భక్తి లేకపోతే ఎవరూ ఏం చేయలేరు కానీ మనకు భక్తి ఉంటే మాత్రం సాయం చేసేందుకు టిటిడి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇన్ని పనులు చేసేందుకు ధర్మ ప్రచార పరిషత్ ఉండగానే, అది సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తుండగానే ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు అని కొత్తగా పెట్టారు.
No comments:
Post a Comment