విజయవాడ, జనవరి 25, (way2newstv.in)
వికేంద్రీకరణ బిల్లుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోరది. శాసనసభలో ఆమోదం పొరదినప్పటికీ, శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో ఏమి చేయాలోనని మల్లగుల్లాలు పడుతోరది. బిల్లులోని అంశాలను అమలు చేసేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు మూడు మార్గాలను సూచిస్తున్నారు. మొదటగా ఆర్డినెన్స్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా తరలిరపును పూర్తి చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ అది ఎరతవరకూ సాధ్యమన్నది అర్థం కావడం లేదు. ఆరు నెలలపాటు మనుగడ ఉండే ఆర్డినెన్స్‌ను ప్రయోగించాలని నిర్ణయించినా, ప్రస్తుతం బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడుతోరది. కోర్టులో కూడా దీనికి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్డినెన్స్ పై మల్లగుల్లాలు
అందుకే ఆర్డినెన్స్ నిర్ణయంపై ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. దీనికోసం న్యాయ నిపుణులతోనూ చర్చించేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో హైకోర్టులో ప్రభుత్వం తరఫున అమరావతి అరశాలపై దాఖలైన పిటిషన్లపై వాదించేందుకు నియమించుకున్న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతోనూ ఆర్డినెన్స్ అంశాన్ని చర్చిరచాలని నిర్ణయించింది. రెండవది రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న కౌన్సిల్ రద్దుపైనా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. కౌన్సిల్‌ను రద్దు చేస్తే సెలెక్ట్ కమిటీ అన్నదే ఇక ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల మురదుగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న భావాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కౌన్సిల్ రద్దు చేసినా ఆ నిర్ణయం అమలులోకి వచ్చేసరికి ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతురదని అరటున్నారు. ఈ రద్దు నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడేంతవరకు కౌన్సిల్ సజీవంగానే ఉరటురదని, అందువల్ల సెలెక్ట్ కమిటీ సమస్య కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. అలాగే కౌన్సిల్ రద్దు కారణంగా రాజకీయ ఉపాధి సమస్య కూడా తలెత్తుతుందన్న భావం వ్యక్తమవుతోరది. ఇప్పటికే ఫిరాయింపులు వేగంగా ఉన్న సమయంలో వారిని రాజకీయంగా ఆదుకోవాలంటే కార్పొరేషన్లతోపాటు కౌన్సిల్ కూడా ఒక వేదికగా ఉరటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే కౌన్సిల్ రద్దు ఆలోచన ఉపయుక్తంగా ఉండదని వారు చెబుతున్నారు. ఇక చివరిగా సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చేంతవరకు వేచి ఉరడడమే మేలన్న భావాన్ని ఇంకొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అన్న మాటను పక్కనపెట్టి కేవలం సచివాలయాన్ని విశాఖకు తరలిస్తూ పాలనాపరమైన నిర్ణయంగా చెప్పే అవకాశాలపైనా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల సాంకేతికంగా సమస్యలు ఉండకపోవచ్చునని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ అరశంపైనా న్యాయ నిపుణులతో చర్చించాల్సి ఉరటురదని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా విశాఖకు సచివాలయం మార్పు తథ్యమని, కొంతకాలం సమయం పట్టవచ్చునని ఆయన తేల్చి చెప్పారు.
No comments:
Post a Comment