Breaking News

28/01/2020

పంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

భారత్‌లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా
గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న కరోనా వైరస్
కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
కరోనా వైరస్... ఇది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన వైరస్.  కరోనా వైరస్ సోకితే మనిషి క్రమంగా మృత్యువుకు దగ్గరవుతూ ఉంటాడు. కరోనా వైరస్ చైనాలో ఇప్పటికే అనేక మందిని బలి తీసుకుంది. ఇప్పుడిది భారత్‌లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయలకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
మన దేశంలో... కేరళలో ఏడుగురికి కరొనా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో వారిపై పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పదివేల మందికిపైగా విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
పంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ విజృభిస్తుండటంతో కరోనా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరోనా వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అంతేకాదు వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా... పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ... రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా, అక్కడ ఉండే వైరస్ బాడీపైకి వచ్చి క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి. అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే... చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.  కరోనా లక్షణాలు కూడా స్వైన్ ఫ్లూను పోలే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే... వెంటనే డాక్టర్‌ను కలవాలని అంటున్నారు వైద్యులు.మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా ఇది వైరస్ కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని, ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని చేతులతో టచ్ చేయవద్దని చెబుతున్నారు. అలాగే చైనా, దాని సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదని చెబుతున్నారు వైద్యులు.మొత్తమ్మీద ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే, వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే... ఎవర్నీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అధికారులు.

No comments:

Post a Comment