Breaking News

11/01/2020

సంక్రాంతి తర్వాత కర్ణాటక కేబినెట్

బెంగళూర్, జనవరి 11 (way2newstv.in)
మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు కేంద్ర నాయకత్వం అపాయింట్ మెంట్ లభించినట్లే. మంత్రి వర్గ విస్తరణ పై చర్చించేందుకు యడ్యూరప్ప గత నెల రోజుల నుంచి కేంద్ర నాయకత్వం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అమిత్ షా వివిధ పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. జాతీయ పౌర పట్టిక విషయంలో దేశమంతా ఆందోళనలు జరుగుతుండటంతో అమిత్ షా బిజీగా ఉన్నారు.మరోవైపు జార్ఖండ్ ఎన్నికలు కూడా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణాలుగా యడ్యూరప్ప చూస్తున్నారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగి దాదాపు నెలన్నర దాటుతున్నప్పటికీ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపడతానని ప్రకటించారు. 
సంక్రాంతి తర్వాత కర్ణాటక కేబినెట్

అంతేకాదు కొందరికి మంత్రి పదవులపై హామీ కూడా ఇచ్చారు. ఇటీవల కర్ణాటక పర్యటనకు వచ్చిన మోదీ దృష్టికి యడ్యూరప్ప విస్తరణ అంశం తీసుకెళ్లినా షాతో మాట్లాడుకోవాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలసింది.మంత్రి వర్గ విస్తరణ రోజురోజుకూ ఆలస్యమవుతుండటంతో యడ్యూరప్ప పై వత్తిడి పెరుగుతోంది. ఇటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి గెలిచి తమ పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి అగ్రనేతల చుట్టూ ప్రదిక్షిణాలు చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటికే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని హామీ లభించిందని వార్తలు వస్తున్నాయి. విస్తరణ లేట్ అయ్యే కొద్దీ ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దీంతో యడ్యూరప్ప కేంద్ర నాయకత్వంతో మాట్లాడి అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 18వ తేదీల్లో ఢిల్లీకి రావాల్సి ఉంటుందని యడ్యూరప్పకు సందేశమొచ్చినట్లు చెబుతున్నారు. అమిత్ షాతో భేటీ అయిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణపై ఒక క్లారిటీ రానుంది. అంటే ఈ నెల మూడో వారంలోనే కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment