Breaking News

23/01/2020

కరోనా వైరస్ తో భారత్ అలెర్ట్

ముంబై, జనవరి 23 (way2newstv.in)
చైనాలోని వుహాన్ నగరంలో బయటపడ్డ కొత్తరకం వైరస్ ఆ దేశాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. అయితే, కొత్తరకం కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లో లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం వరకు 43 విమానాలు, 9,156 మంది ప్రయాణికులను పరిశీలించామని ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రీతి సుడాన్‌ తెలిపారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాతో సహా ఏడు విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా కరోనా వైరస్ లక్షణాలున్న బాధితులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. 
కరోనా వైరస్ తో భారత్ అలెర్ట్

ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు ఏవీ నమోదు కాలేదని... చైనాలోని భారత దౌత్య కార్యాలయ అధికారుల నుంచి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని ప్రీతి సుడాన్ పేర్కొన్నారు.కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా, 440 కేసులు నమోదయినట్టు భారత దౌత్య అధికారులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తైవాన్‌తో సహా 14 ప్రావిన్స్‌ల్లో ఈ కేసులు నమోదైనట్లు ప్రీతి తెలిపారు. చైనా, హాంకాంగ్‌ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ లక్షణాలను గుర్తించేందుకు పలు విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారేమో తెలుసుకోవాలని పౌరవిమానయాన శాఖ అధికారులకు సూచించింది.కాగా, కరోనా వైరస్‌కు పాములే కారణమని భావిస్తున్నారు. బహుశా చైనా కోబ్రో, క్రయిత్‌లే సరికొత్త వైరస్‌ ప్రబళినట్టు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ శీతాకాలంలో చైనాలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి ఇవే అసలు మూలం కావచ్చని పేర్కొంటున్నారు. తైవాన్ క్రయిత్ లేదా చైనీస్ క్రయిత్‌గా పిలవబడే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. మధ్య, దక్షిణ చైనాలతోపాటు ఆగ్నేయ ఆసియాలో ఇవి అధికంగా ఉంటాయి. కరోనా వైరస్ తొలి కేసును డిసెంబరు చివరిన వుహాన్ నగరంలో గుర్తించారు. తర్వాత ఇది చైనా అంతటా వ్యాప్తిచెందింది. అక్కడ నుంచి అమెరికాకు సైతం పాకింది.

No comments:

Post a Comment