Breaking News

23/01/2020

ఇది ప్రజాస్వామ్య విజయం

అమరావతి జనవరి 23 (way2newstv.in)
టిడిపి నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర నేతలు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ కౌన్సిల్ లో నిన్న టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారు. ధర్మాన్ని కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని అన్నారు. యనమల అనుభవం- పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం. టిడిపి యువ ఎమ్మెల్సీలు ధైర్యం, తెగువ ప్రశంసనీయం. వైసిపి మంత్రులు కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా దుర్భాషలాడారు. 
ఇది ప్రజాస్వామ్య విజయం

అసభ్య పదజాలంతో చైర్మన్ ని అవమానించారు. నమాజు చేయనీకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారు.  ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారని వ్యాఖ్యానించారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారు. ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారు.  ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు.  ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా  లేక్క చేయలేదు. అసెంబ్లీలో వైసిపి ఏకపక్షంగా వ్యవహరించింది.  చర్చకు అవకాశం ఇవ్వకుండా మొండిగా చేసింది. శాంతియుతంగా టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్నారు. రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను ఆదేశించారు. మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి..?  పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..? ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైసిపి చూసింది.  టిడిపి ఎమ్మెల్సీలంతా ప్రతిఘటించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అన్నారు. ఒకరితో ఒకరు పోటిబడ్డారు, వాళ్లకుండే శక్తినంతా వినియోగించారు. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం..ప్రజల ఆకాంక్షలు నిలబెట్టే ప్రజాస్వామ్య పోరాటం.సంఖ్య కాదు ముఖ్యం, స్పూర్తి ముఖ్యం అని రుజువు చేశారు. సభలో వైసిపి ఎన్నో దురాగతాలకు పాల్పడింది.  కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. 25మంది మంత్రులు కౌన్సిల్ లోనే తిష్ట వేసి వీరంగం చేశారని చంద్రబాబు అన్నారు. 1984ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చారు. అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం. ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఇప్పుడూ అదే స్ఫూర్తిని మళ్లీ టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చూపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని రాజధాని పరిరక్షణ ఉద్యమం జ్ఞాపకం తెచ్చింది. వైసిపి వాళ్లు వేధించినా టిడిపి ఎమ్మెల్సీలు వీరోచితంగా నిలబడ్డారు.  గల్లా జయదేవ్ ను శారీరకంగా మానసికంగా హింసించారు.  టిడిపి ఎమ్మెల్సీలు ధ్వజస్థంభాలుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. చరిత్రలో మీ పోరాటం మిగిలిపోతుంది, మీ త్యాగాలు వృధా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది. చట్ట సభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను టిడిపి నిలబెట్టింది. ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. జెఏసి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.

No comments:

Post a Comment