శ్రీశైలం, జనవరి 9 (way2newstv.in)
జగనన్న అమ్మఒడి, గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం, సచివాలయాల భవన నిర్మాణాలకు భూమి పూజ,శంకుస్థాపన తదితర అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద జిల్లా కలెక్టర్ వారికి ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామారావు, అర్చక స్వాములు, వేదపండితులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్
తొలుత రత్న గర్భ గణపతి స్వామి వారిని దర్శించుకుని అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్ల దర్శనానంతరం మల్లికా గుండంలో శ్రీ స్వామివారి ఆలయ విమాన శిఖరం ప్రతిబింబాన్ని తిలకించారు. తదుపరి భ్రమరాంబ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కలెక్టర్ గారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. దేవస్థాన న కార్యనిర్వహణాధికారి శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను కలెక్టర్ కు అందజేశారు. ఆర్డిఓ వెంకటేశు తాసిల్దార్ రాజేంద్ర సింగ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
No comments:
Post a Comment