విజయవాడ జనవరి 09 (way2newstv.in)
అమరావతి పరిరక్షణ సమితి బస్ యాత్రను అడ్డుకున్నారు. చంద్రబాబు తో పాటు పలువురు నేతల అరెస్ట్ ను జనసేన తరపున ఖండిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరపున పోరాడుతాం. జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు తమ పార్టీ నేతలు కూడా పాల్గొంటారు.
రైతుల పక్షాన జనసేన పోరాటం
రాబోయే వారం రోజుల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో కలిసి చర్చించామని అన్నారు. రైతులకు భరోసా కల్పించాలి. రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోండి. ప్రజాప్రతినిధులు రాజధాని గ్రామ ప్రాంతాల్లో పర్యటించాలి. వారి వేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. అమ్మ ఒడి పై రోజుకో ప్రకటన చేస్తున్నారు. అమ్మ ఒడి కి ఇతర పథకాల నిధులను మల్లించారు. రాష్ట్రంలో 67 శాతం ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కి నిధులు ఖర్చు చేస్తే మంచిది. అమ్మ ఒడి పధకం పారదర్శకంగా లేదని అయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment