Breaking News

29/01/2020

నితీష్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్

పాట్నా, జనవరి 29 (way2newstv.in)
జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నుంచి వైదొలగనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జేడీయూకు దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణాలు పౌరసత్వ చట్ట సవరణ. గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏకు వ్యతిరేకంగా, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బీహార్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు కలసి పోటీ చేయాలని ఒప్పందం కుదిరినప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీని వదలిపెట్టడం లేదు.దీంతో నితీష్ కుమార్ కు ఇబ్బందిగా మారింది. ప్రశాంత్ కిషోర్ ను నితీష్ కుమార్ కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ, పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపింది. అయినా నితీష్ కుమార్ మాత్రం బీహార్ లో సీఏఏను అమలు పర్చబోమని చెప్పేశారు. 
 నితీష్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్

దీనికి వ్యతిరేకంగా త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కూడా ప్రకటించారు.అయినా ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. ఇది కూడా నితీష్ కుమార్ ను ఇబ్బంది పెట్టే అంశంగానే మారింది. బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలితో బీజేపీ దూరం జరుగుతుందనే భావన నితీష్ కుమార్ లో ఏర్పడింది. నితీష్ కుమార్ పార్టీ ఉపాధ్యక్షుడు అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలనుకుంటే ఉండవచ్చని, ఇష్టం లేకుంటే వెళ్లవచ్చని నితీష్ కుమార్ సీరియస్ గా వ్యాఖ్యానించారు. జేడీయూ నిబంధనల మేరకే నడుచుకోవాలని పరోక్ష హెచ్చరికలు కూడా ప్రశాంత్ కిషోర్ కు జారీ చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే రీతిలో సమాధానమిచ్చారు. తాను బీహార్ వచ్చి సమాధానం చెబుతానని ధీటుగానే సమాధానమిచ్చారు. దీంతో జేడీయూలో ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.వద్దనుకుంటే వెళ్లిపోవచ్చు ప్రశాంత్ కిశోర్‌పై పరోక్షంగా బిహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీల పట్ల పీకే చేసిన వ్యాఖ్యలకు తన సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన.. ఎవరైనా నచ్చితేనే పార్టీలో ఉండొచ్చూ.. లేదా వెళ్లాలంటే బయటకు వెళ్లొచ్చంటూ పీకే టార్గెట్‌గా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.కొందరు ట్వీట్లు పెడుతున్నారు. ఆయన్ను ట్వీట్లు చేసుకోనీయండి. దానితో నేనేం చేయాలి? జేడీయూలో ఎవరైనా ఉండొచ్చు.. కావాలనుకుంటే బయటకు వెళ్లొచ్చు కూడా’’ అని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా పీకే వరుసబెట్టి ట్వీట్లు చేస్తుండటంతో నితీశ్ ఇలా స్పందించారు.‘‘ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు. కానీ నేనొకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఆయన పార్టీలో కొనసాగాలనుకుంటే పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలి’’ అని జేడీయూ అధినేత స్పష్టం చేశారు. అమిత్ షా చేర్చుకోమనడంతోనే పీకేను పార్టీలో చేర్చుకున్నానన్న నితీశ్.. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ హోం మంత్రికి థ్యాంక్స్ చెప్పాలన్నారు. అమిత్ షాను పీకే టార్గెట్ చేసుకోవడంతో జేడీయూ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఢిల్లీ ప్రజలు ఈవీఎం మీట మీద కమలం గుర్తును బలంగా నొక్కుతారు. దాని ప్రభావం షాహీన్ బాగ్‌లో కనిపిస్తుందని’’ పీకే వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య పోటీ నెలకొనగా.. కేజ్రీవాల్ ప్రశాంత్ కిశోర్ సేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపారు. జేడీయూ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది.జేడీయూకు చెందిన మరో నేత పవన్ వర్మ‌ను కూడా నితీశ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని, పౌరసత్వ సవరణ చట్టాన్ని వర్మ బహిరంగంగా వ్యతిరేకించారు. తన నిర్ణయం విషయంలో పునరాలోచించాలని వర్మ నితీశ్‌కు బహిరంగ లేఖ రాశారు. దీనికి సమాధానం ఇచ్చిన సీఎం.. నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లొచ్చన్నారు. ఇద్దరు కీలక నేతలు పార్టీ వైఖరికి విరుద్ధంగా వ్యవహరిస్తుండంటంతో నితీశ్ సహనం కోల్పోతున్నారని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ తోడ్పాటు అందించారు. గత బిహార్ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కోసం కూడా పీకే పని చేశారు. నితీశ్ వ్యాఖ్యల పట్ల పీకే స్పందిస్తూ.. నా సమాధానం కోసం మీరు వేచి ఉండాలి. నేను బిహార్ వచ్చి బదులిస్తానన్నారు.

No comments:

Post a Comment